Corona in TS: తెలంగాణలో కొత్తగా 296 కరోనా కేసులు, వెల్లడయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 74 తాజా కేసులు నమోదు

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 69,833 కరోనా పరీక్షలు నిర్వహించగా, 296 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 74 కొత్త కేసులు నమోదు కాగా, కరీంనగర్ జిల్లాలో 29, వరంగల్ అర్బన్ జిల్లాలో 22 కేసులు వెల్లడయ్యాయి.

Corona in TS: తెలంగాణలో కొత్తగా 296 కరోనా కేసులు, వెల్లడయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 74 తాజా కేసులు నమోదు
Coronavirus-in-India ( photo-PTI)

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 69,833 కరోనా పరీక్షలు నిర్వహించగా, 296 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 74 కొత్త కేసులు నమోదు కాగా, కరీంనగర్ జిల్లాలో 29, వరంగల్ అర్బన్ జిల్లాలో 22 కేసులు వెల్లడయ్యాయి. వికారాబాద్, నారాయణపేట, కొమరంభీం ఆసిఫాబాద్, జోగులాంబ గద్వాల్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 322 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 6,61,302 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,52,085 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 5,324 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మరణాల సంఖ్య 3,893కి పెరిగింది.

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Sep 12, 2021 09:31 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).