Corona in TS: తెలంగాణలో మళ్లీ 500కి పైగా కేసులు, గత 24 గంటల్లో 581 మందికి కోవిడ్, అత్యధికంగా హైదరాబాదులో 227 కొత్త కేసులు

తెలంగాణలో కరోనా రోజువారీ కేసులు 500కి పైబడి నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో 28,306 శాంపిల్స్ పరీక్షించగా, 581 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా హైదరాబాదులో 227 కొత్త కేసులు నమోదయ్యాయి.

Corona in TS: తెలంగాణలో మళ్లీ 500కి పైగా కేసులు, గత 24 గంటల్లో 581 మందికి కోవిడ్, అత్యధికంగా హైదరాబాదులో 227 కొత్త కేసులు
Coronavirus | Representational Image | (Photo Credits: ANI)

తెలంగాణలో కరోనా రోజువారీ కేసులు 500కి పైబడి నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో 28,306 శాంపిల్స్ పరీక్షించగా, 581 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా హైదరాబాదులో 227 కొత్త కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 45, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 40, పెద్దపల్లి జిల్లాలో 30, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 26, మంచిర్యాల జిల్లాలో 24, నల్గొండ జిల్లాలో 22, ఖమ్మం జిల్లాలో 20 కేసులు గుర్తించారు.

అదే సమయంలో 645 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. కొత్తగా మరణాలేవీ నమోదుకాలేదు. తెలంగాణలో ఇప్పటిదాకా 8,14,884 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... 8,06,207 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,566 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా కరోనాతో 4,111 మంది మరణించారు.

Telangana Logs 581 New Covid Cases in Last 24 hours

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jul 25, 2022 09:28 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).