కరీంగనర్‌ కళోత్సవాల సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన కేటీఆర్‌.. మై విలేజ్‌ షో ఫేమ్‌ గంగవ్వతో కలిసి జోకులు వేశారు. తప్పకుండా మై విలేజ్‌ షోకి గెస్ట్‌గా వస్తాను అని తెలిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది. గంగవ్వని సోషల్ మీడియాలో చాలాసార్లు చూశా కానీ.. స్వయంగా కలిసింది లేదు. ఆమె మంచిది కాబట్టి నన్ను మహేష్ బాబుతో పోల్చింది. కానీ ఈ మాట మహేష్ బాబు వింటే ఫీల్ అవుతాడు. గంగవ్వా (గంగవ్వ) నీ కళ్లు చూపెట్టుకోవాలి జల్దీ.. ఇప్పుడే గంగవ్వకి మాట ఇచ్చాను.. మై విలేజ్ షోకి గెస్ట్‌గా వస్తానని.. ఆ షోకి తప్పకుండా వెళ్తా అని అన్నాడు. నాకు తెలిసిన నాలుగు విషయాలు చెప్తా. అలాగే గంగవ్వ దగ్గర 4 విషయాలు నేర్చుకుంటాను'' అన్నారు కేటీఆర్. అయితే కేటీఆర్‌ తాను ప్రసంగిస్తున్నంతసేపు.. గంగవ్వని.. గంగమ్మ అని పిలిచాడు.

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)