అసెంబ్లీలో నీ అమ్మ అని మాట్లాడటం కరెక్ట్ కాదు, జనాలకు రాంగ్ మెసేజ్ పోతుంది.. ఎమ్మెల్యే దానం నాగేందర్ బేషరతుగా అతని వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేశారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. అధికార ప్రతిపక్ష ఎమ్మెల్యేల మాధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అసభ్య పదజాలంతో రెచ్చిపోయారు. అసెంబ్లీలో బూతులు మాట్లాడిన దానం నాగేందర్ .. నీ అ.., తోలు తీస్తా, బయట తిరగనియ్య ఏమనుకుంటున్నారు రా అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై బెదిరింపులకు దిగారు.
దీనిపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మాట్లాడుతూ దానం నాగేందర్ బూతులు మాట్లాడినట్లు తేలితే రికార్డ్స్ నుండి తొలగిస్తామని అన్నారు. ఇక నీ అమ్మ, మా అమ్మ అనేది బూతు కాదు సంస్కారవంతమైన భాష అని దానం నాగేందర్ కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు.
Here's Videos
అసెంబ్లీలో నీ అమ్మ అని మాట్లాడటం కరెక్ట్ కాదు, జనాలకు రాంగ్ మెసేజ్ పోతుంది.. ఎమ్మెల్యే దానం నాగేందర్ బేషరతుగా అతని వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి - ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ https://t.co/DeoHad11Ba pic.twitter.com/i1uAsIgYZk
— Telugu Scribe (@TeluguScribe) August 2, 2024
దానం నాగేందర్ బూతులు మాట్లాడినట్లు తేలితే రికార్డ్స్ నుండి తొలగిస్తాం - తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ pic.twitter.com/jdPlSIM2Yb
— Telugu Scribe (@TeluguScribe) August 2, 2024
నీ అమ్మ, మా అమ్మ అనేది బూతు కాదు సంస్కారవంతమైన భాష - దానం నాగేందర్ https://t.co/MxXhq9wHwI pic.twitter.com/pr02jwAUEj
— Telugu Scribe (@TeluguScribe) August 2, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)