Telangana Polls 2023: కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతున్న రాజీనామాలు, టికెట్ రాకపోవడంతో జిట్టా బాలకృష్ణ రెడ్డి రాజీనామా, బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లుగా వార్తలు
భువనగిరి కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. ఇటీవలే బాలకృష్ణారెడ్డిని బీజేపీ పార్టీ సస్పెండ్ చేసింది. ఆయనతో పాటు మహబూబ్ నగర్ మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సైతం కాషాయాన్ని వీడారు. ఇటీవలే ఇద్దరూ కలిసి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు
భువనగిరి కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. ఇటీవలే బాలకృష్ణారెడ్డిని బీజేపీ పార్టీ సస్పెండ్ చేసింది. ఆయనతో పాటు మహబూబ్ నగర్ మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సైతం కాషాయాన్ని వీడారు. ఇటీవలే ఇద్దరూ కలిసి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ ఇద్దరు నేతలు ఎమ్మెల్యే టికెట్లను ఆశించారు. ఇదే హామీపై వారు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా ఏఐసీసీ ఎన్నికల స్క్రినింగ్ కమిటీ సంచలన ప్రకటన చేసింది.
119 సీట్లకు గాను 55 సీట్లకు సంబంధించి అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను వెల్లడించింది. ఈ లిస్టులో ఇతర పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలో జంప్ అయిన 20 మంది నేతలకు టికెట్లు దక్కాయి. ఇందులో 17 మంది రెడ్లకు దక్కడం విశేషం. ఉద్యమకారుడిగా జిట్టా బాలకృష్ణా రెడ్డికి మంచి పేరుంది. ఈ తరుణంలో తను కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ పార్టీలో జంప్ అయ్యేందుకు ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం.
Here's News
కాంగ్రెస్కు జిట్టా బాలకృష్ణ రెడ్డి రాజీనామా
ఈ మద్యే బీజేపీ నుండి కాంగ్రెస్లో చేరిన జిట్టా బాలకృష్ణ రెడ్డి
కాంగ్రెస్ నుండి టికెట్ ఆశించి రాకపోవడంతో కాంగ్రెస్కు రాజీనామా
బీఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశం. pic.twitter.com/n0MYtLqcP1
— Telugu Scribe (@TeluguScribe) October 16, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Oct 16, 2023 07:24 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

