Covid in TS: తెలంగాణలో కొత్తగా 1,028 మందికి కరోనా పాజిటివ్, జీహెచ్ఎంసీ పరిధిలో 132 కొత్త కేసులు నమోదు, ఖమ్మం జిల్లాలో కొత్తగా 76 కేసులు
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 1,18,427 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,028 మందికి పాజిటివ్ గా వెల్లడైంది. జీహెచ్ఎంసీ పరిధిలో 132 కొత్త కేసులు నమోదు కాగా, ఖమ్మం జిల్లాలో 76 కేసులను గుర్తించారు. అత్యల్పంగా కామారెడ్డి జిల్లాలో 1 కేసు వెల్లడైంది. అదే సమయంలో 1,489 మంది కరోనా నుంచి కోలుకోగా, 9 మంది మృతి చెందారు. తాజా మరణాలతో కలిపి కరోనా మృతుల సంఖ్య 3,627కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,19,865 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,01,184 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 15,054 మంది చికిత్స పొందుతున్నారు.
Media Bulletin on status of positive cases #COVID19 in Telangana.
(Dated.26.06.2021 at 5.30pm)@TelanganaHealth #StaySafeStayHealthy pic.twitter.com/Ds9wBUS3yP
— IPRDepartment (@IPRTelangana) June 26, 2021
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jun 27, 2021 11:25 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

