Nalgonda Road Accident: వీడియో ఇదిగో, పొగమంచు కారణంగా ఘోర రోడ్డు ప్రమాదాలు, నల్గొండ జిల్లాలో ఆరుమంది మృతి
నల్గొండ జిల్లాలో పొగమంచు కారణంగా 2 రోడ్డుప్రమాదాలు.. ఒకే కుటుంబం వారు 5 మంది మృతి. వేంపాడు వద్ద నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని బైక్‌తో ఢీకొట్టిన కేశవులు.. ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. కేశవులు కుటుంబ సభ్యులు అతనిని చూడటానికి టాటా ఏస్ వాహనంలో వెళ్తుండగా ఆ వాహనాన్ని ఢీకొట్టిన ట్యాంకర్.. ప్రమాదంలో కేశవులు కుటుంబసభ్యులు 4 మరణించారు.
రోడ్డు ప్రమాదంలో కుటుంబ సభ్యుడు చనిపోయాడని తెలిసి ఆటోలో బయలుదేరిన కుటుంబ సభ్యులు కూడా ప్రమాదానికి గురయ్యారు. రెండు ప్రమాదాల్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దుర్మరణం చెందగా.. చావుబతుకుల్లో ఉన్న మరో ముగ్గురిని కాపాడేందుకు వైద్యులు ప్రయత్నిస్తున్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుందీ విషాదం.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..పెద్దవూర మండలం నిమ్మానాయక్ తండాకు చెందిన కేశవులు (28) ఆదివారం రాత్రి మిర్యాలగూడ నుంచి పెద్దవూరకు వెళుతూ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. నిమ్మనూరులోని వేంపాడు దగ్గర్లో సైదులు అనే పెద్దాయనను ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో సైదులు, కేశవులు ఇద్దరూ చనిపోయారు. కేశవులు మృతి వార్త తెలిసి ఆయన కుటుంబం కన్నీటిపర్యంతమైంది. ప్రమాదం జరిగిన చోటుకు టాటా ఏస్ వాహనంలో కేశవులు కుటుంబ సభ్యులు ఏడుగురు బయలుదేరారు.
Here's Videos
#Tragedy struck a family in 2 #RoadAccident leading to the death of 5 persons in #Nalgonda dist, due to #fog
Keshavulu, hits a pedestrian with his bike at Vempadu, both died
His family members started to see him, when a tanker rammed their Tata Ace, here 4 deaths.#Telangana pic.twitter.com/OcEH0HqGX4
— Surya Reddy (@jsuryareddy) December 25, 2023
నల్గొండ జిల్లాలో పొగమంచు కారణంగా 2 రోడ్డుప్రమాదాలు.. ఒకే కుటుంబం వారు 5 మంది మృతి
వేంపాడు వద్ద నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని బైక్‌తో ఢీకొట్టిన కేశవులు.. ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు.
కేశవులు కుటుంబ సభ్యులు అతనిని చూడటానికి టాటా ఏస్ వాహనంలో వెళ్తుండగా ఆ వాహనాన్ని… pic.twitter.com/cDz7856Zod
— Telugu Scribe (@TeluguScribe) December 25, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Dec 25, 2023 01:25 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

