Telangana Road Accident: పండుగ వేళ దైవ దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం, ఒకే కుటుంబంలో నలుగురు అక్కడికక్కడే మృతి

మహబూబాబాద్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికంగా కంబాలపల్లి శివారులో కారు-ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

Telangana Road Accident: పండుగ వేళ దైవ దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం, ఒకే కుటుంబంలో నలుగురు అక్కడికక్కడే మృతి
Representative Image

మహబూబాబాద్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికంగా కంబాలపల్లి శివారులో కారు-ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను మహబూబాబాద్ ప్రభుత్వ హాస్పటల్‌కు తరలించారు. మృతులు మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం చిన్న ఎల్లాపూర్ గ్రామానికి చెందినవారిగా గుర్తించారు.

ఓ కుటంబం నాగార్జునసాగర్ సమీపంలోని బుడియా బాపు దేవుడిని సందర్శించుకుని ఆటోలో ఇంటికి తిరిగి వస్తున్నారు. అదే జిల్లాకు చెందిన మరో కుటుంబం గుంజేడులోని ముసలమ్మ దేవతను సందర్శించుకుని కారులో తిరిగి వస్తున్నారు. ఇంతలో కంబాలపల్లి శివారుకు చేరుకోగానే కారు-ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఇస్లావత్ శ్రీను(కొడుకు), పాప ( శ్రీను తల్లి ), రిత్విక్ ( శ్రీను కుమారుడు), రిత్విక ( శ్రీను కూతురు) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

Here's News

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jan 15, 2024 11:15 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).