హైదరాబాద్ నగరంలో మియాపూర్ బస్టాండ్‌లో అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తిపై గుర్తు తెలియని దుండగులు దాడి చేసి హత్యకు పాల్పడ్డారు. దుండగుల దాడిలో బాధితుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బుధవారం రాత్రి ఈ హత్య జరిగినట్లు పోలీసులు తెలిపారు. తాగిన తర్వాత ఇద్దరి వ్యక్తుల మధ్య జరిగిన గొడవ హత్యకు కారణమై ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. బండరాయితో నెత్తి పైన గట్టిగా కొట్టడంతో మరణించినట్లు తెలుస్తోంది. మృతుడిని బీహార్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
Here's Update
హైదరాబాద్: మియాపూర్ బస్టాండ్‌లో దారుణం.. అందరూ చూస్తుండగానే వ్యక్తిపై దాడి, హత్య.. గుర్తు తెలియని వ్యక్తిపై దాడి చేసి, హత్య చేసిన దుండగులు.. దుండగుల దాడిలో వ్యక్తి అక్కడికక్కడే మృతి#Hyderabad #CrimeNews
— NTV Breaking News (@NTVJustIn) February 9, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)