నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలో రాత్రిపూట పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో కోటగిరి మండలం, కొత్తపల్లికి చెందిన ఓ యువకుడు బాగా మద్యం తాగి భార్యతో స్వగ్రామానికి వెళ్తుండగా పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించగా 360 శాతం ఆల్కహాల్ ఉన్నట్టు మిషన్లో వచ్చింది.

అదే సమయంలో కోటగిరి మండలం సుద్దుల గ్రామ సర్పంచ్ సాయిలు అటువైపు వెళుతుండగా ఇది గమనించారు. మద్యం తాగిన యువకుడిని విడిచి పెట్టాలని పోలీసులకు సదరు సర్పంచ్ హుకుం జారీ చేశాడు. యువకుడు మద్యం అధికంగా తాగి డ్రైవింగ్ చేస్తున్నారని జరిమానా వేస్తామని పోలీసుల పోలీసులు సర్పంచుకు వివరించినా వినకుండా నేను సర్పంచును అంటూ మొదలైన గొడవ కాస్త పెద్ద రచ్చగా మారి ఎస్సై మీద దాడి చేసే వరకు వెళ్లింది.మద్యం తాగిన యువకుడు రోడ్డుపై పడుకొని హల్చల్ చేశాడు. ఆ తర్వాత సర్పంచ్ ఏకంగా పోలీసుల వాహనం తాళం లాక్కొని నానా హంగామా చేశాడు.

young man who was caught in a drunken drive and attacked the police in Nizamabad District

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)