నిర్మల్‌ జిల్లాలో ఖానాపూర్‌ పట్టణంలో శివాజీనగర్‌లో దారుణం చోటుచేసుకుంది. నడిరోడ్డుపై ఓ యువతిని గొడ్డలితో నరికి దారుణంగా హత్య చేశాడు ఓ యువకుడు.ఖానాపూర్‌ పట్టణంలోని అంబేడ్కర్‌ నగర్ కాలనీకి చెందిన సీహెచ్ సోనీ అలియాస్‌ స్వీటీ (20).. టైలరింగ్‌ షాపు నుంచి ఇంటికి వెళ్తుండగా యువకుడు కత్తితో దాడి చేశాడు. అడ్డుకోబోయిన ఆమె వదిన, పక్కనే ఉన్న రెండేళ్ల చిన్నారిపైనా దాడికి పాల్పడ్డాడు.

ఈ ఘటనలో యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. బాలుడి తలకు గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని సీఐ మోహన్‌, ఎస్‌ఐ లింబాద్రి పరిశీలించారు.యువతిపై దాడికి ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. అలేఖ్యకు మరో యువకుడితో నెల క్రితం వివాహం నిశ్చయమైంది. దీనిని తట్టుకోలేక అలేఖ్యపై ఈ దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. హత్య చేసిన తర్వాత పరారైన నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Here's Disturbed Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)