తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించి సంచలనం రేపిన సామాన్య యువతి బర్రెలక్క అలియాస్ శిరీష సోదరుడిపై దాడి కలకలం రేపిన సంగతి విదితమే. దీనిపై శిరీష సోదరుడిపై దాడిని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఖండించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. శిరీష సోదరుడిపై దాడి చేయడం అత్యంత బాధాకరమన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో శిరీష, ఆమె కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని కోరారు. ఈ మేరకు తెలంగాణ డీజీపీకి, సిఈవో తెలంగాణను కోరుతూ ట్యాగ్ చేశారు.కాగా కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర్య అభ్యర్థిగా బర్రెలక్క పోటీలో నిలిచారు. ఇదిలా ఉంటే బర్రెలక్కకు మద్దతుగా రాష్ట్రం నలుమూలల నుంచి యువత తరలివస్తున్నారు.అలాగే దేశవ్యాప్తంగా పలువురు ఎన్నికల ప్రచారానికి ఖర్చులు సైతం పంపుతున్న సంగతి తెలిసిందే

JD Lakshminarayana on Barrelakka (Photo-X)

Here's Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)