కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం తెలంగాణ పర్యటనకు వచ్చారు. తెలంగాణలోని పలు పార్లమెంటు నియోజకవర్గాలకు బీజేపీ అధిష్ఠానం పలువురు కేంద్ర మంత్రులను కో ఆర్డినేటర్లుగా నియమించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా జహీరాబాద్ పార్లమెంటు కో ఆర్డినేటర్‌గా నియమితులైన నిర్మలా సీతారామన్ గురువారం నుంచి 3 రోజుల పాటు నియోజకవర్గ పరిధిలో పర్యటించనున్నారు.
ఈ పర్యటన నిమిత్తం గురువారం హైదరాబాద్ వచ్చిన నిర్మలా సీతారామన్‌కు బీజేపీ శ్రేణులు శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికాయి.అనంతరం ఆమె నియోజకవర్గ స్థాయి నేతలతో భేటీ అయ్యారు. 3 రోజుల పాటు ఆమె నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ ఆయా ప్రాంతాల స్థానిక నేతలతో భేటీ అవుతూ... పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేయనున్నారు.
Smt @nsitharaman was accorded a warm welcome at the entrance of Kamareddy Town under Zaheerabad Parliamentary Constituency in Telangana by @BJP4Telangana District President Smt Aruna Tara and other office bearers of the party. pic.twitter.com/IlgdvLv7Et
— NSitharamanOffice (@nsitharamanoffc) September 1, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)
 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     QuickLY
                                                                                QuickLY
                                     Socially
                                                                                Socially
                                     
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                             
                     
                     
                     
                     
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                
