Weather Update: తెలంగాణకు రానున్న రెండు రోజుల పాటు భారీ వర్ష సూచన, హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో ఉరుములు,మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం
గత వారం నుంచి తెలంగాణవ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. రాత్రి పలు చోట్ల కురిసిన వర్షంతో జాగా ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఈ క్రమంలో తెలంగాణలో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
గత వారం నుంచి తెలంగాణవ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. రాత్రి పలు చోట్ల కురిసిన వర్షంతో జాగా ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఈ క్రమంలో తెలంగాణలో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వాతావరణశాఖ తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక, శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. కాగా, శుక్రవారం నుంచి రెండు రోజుల పాటు నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, జనగాం, యాదాద్రి, వరంగల్, హన్మకొండ, సిద్దిపేట, నిజామాబాద్, పెద్దపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు పేర్కొంది.
Here's News Update
Rains further traversed in entire Central, South, East TS pouring all over Nalgonda, Suryapet, Khammam, Jangaon, Yadadri, Warangal, Hnk, Siddipet
Now these rains pouring over Mancherial, Peddapalli, Mulugu, Bhupalapally, Bhadradri will continue for 2hrs
Other parts - overcast https://t.co/Uq5n4pu03G
— Telangana Weatherman (@balaji25_t) September 22, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Sep 22, 2023 01:26 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

