ప్రపంచ కుబేరుడు, టెస్లా, స్పేస్ ఎక్స్ ఫౌండర్ ఎలన్ మస్క్ సోషల్‌మీడియా వ్యాపారంలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఎలన్ మస్క్ ట్విటర్‌లో 9.2 శాతం వాటాలను కొన్నట్లు తెలిసింది. ఫిబ్రవరి 10, 2022 నాటికి ట్విటర్‌లో9.2 శాతం వాటాను ఎలన్ మస్క్ కలిగి ఉన్నారని అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ ఫైలింగ్‌లో వెల్లడైంది. ఎలన్ మస్క్ తమ కంపెనీలో 73,486,938 షేర్లను కొనుగోలు చేశారని ట్విటర్ ఇంక్ కూడా తన ఫైలింగ్‌లో పేర్కొంది. ఈ షేర్లు విలువ శుక్రవారం క్లోజింగ్ ధర 2.9 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ వాటాల కొనుగోలుతో ట్విటర్‌లో అతిపెద్ద షేర్ హోల్డర్‌గా ఎలన్ మస్క్ నిలిచారు.
BREAKING: Elon Musk has taken a 9.2% passive stake in Twitter, Bloomberg News reports https://t.co/qcG7Sq4fGT pic.twitter.com/WFGxQGN7UY
— Bloomberg (@business) April 4, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)