యాపిల్ కంపెనీ స‌హా వ్య‌వ‌స్థాప‌కుడు దివంగ‌త స్టీవ్ జాబ్స్ స‌తీమ‌ణి లారీన్ పావెల్ జాబ్స్ అస్వస్తతకు గురయ్యారు. యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జ‌రుగుతున్న మ‌హా కుంభ‌మేళాకు ఆమె హాజరు కాగా వాతావరణ మార్పు వల్ల ఆమె అస్వ‌స్థ‌త‌కు గురైన‌ట్టు నిరంజ‌నీ అఖాడాకు చెందిన మ‌హా మండ‌లేశ్వ‌ర్ స్వామి కైలాసానంద గిరి మ‌హారాజ్ తెలిపారు. ప్ర‌స్తుతం లారీన్ తాము ఏర్పాటు చేసిన శిబిరంలో చికిత్స పొందుతున్నార‌ని, ఆరోగ్యం కుదుట‌ప‌డ్డాక త్రివేణి సంగ‌మంలో ప‌విత్ర స్నానం ఆచ‌రిస్తార‌ని వెల్ల‌డించారు.లారీన్ త‌న పేరును క‌మ‌ల‌గా మార్చుకున్న‌ట్లు కైలాసానంద గిరి మ‌హారాజ్ పేర్కొన్నారు. లారీన్ భార‌త్‌లో ప‌ర్య‌టించ‌డం ఇది రెండోసారి అని తెలిపారు. ధ్యానం చేసేందుకు ఆమె త‌మ ఆశ్ర‌మానికి వ‌చ్చి వెళ్తుంటార‌ని గిరి మ‌హారాజ్ తెలిపారు.

మహా కుంభమేళా, త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించిన 2 కోట్ల మంది భక్తులు, అమృత స్నానాన్ని ఆచరించిన అఖాడా వర్గానికి చెందిన సాధువులు

Steve Jobs’ Wife, Faces Health Issues at Maha Kumbh Mela

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)