Harsh Goenka on ISRO Chief Salary: ఇస్రో చైర్మన్‌ ఎస్‌ సోమనాథ్‌ నెల జీతం రూ. రెండున్నర లక్షలు, ఇది ఆయనకు తగిన జీతమేనా అని ప్రశ్నించిన హర్ష గోయెంకా

ఇస్రో చైర్మన్‌ సోమనాథ్‌ నెల జీతంగా రెండున్నర లక్షలు సంపాదిస్తున్నారని తెలిపిన గోయింకా.. ఇది ఆయనకు తగిన జీతమేనా అని ప్రశ్నించారు. శాస్త్రీయ విజ్ఞానం, పరిశోధనలపై సోమనాథ్‌కు ఉన్న ఆసక్తి, నిబద్ధతను వివరిస్తూ ఆయన్ను ప్రశంసలతో ముంచెత్తారు.

Harsh Goenka on ISRO Chief Salary: ఇస్రో చైర్మన్‌ ఎస్‌ సోమనాథ్‌ నెల జీతం రూ. రెండున్నర లక్షలు, ఇది ఆయనకు తగిన జీతమేనా అని ప్రశ్నించిన హర్ష గోయెంకా
Harsh Goenka's Post On ISRO Chief S Somanath's Monthly Salary Sparks Debate (Photo-X)

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చైర్మన్‌ ఎస్‌ సోమనాథ్‌ నెలవారీ జీతాన్ని ట్విటర్‌ వేదికగా ఆర్‌పీజీ గ్రూప్‌ అధినేత హర్ష గోయెంకా బహిర్గతం చేయడంతో ఇస్రో చైర్మన్‌ పేరు తీవ్ర చర్చకు దారితీసింది.ఇస్రో చైర్మన్‌ సోమనాథ్‌ నెల జీతంగా రూ. రెండున్నర లక్షలు సంపాదిస్తున్నారని తెలిపిన గోయింకా.. ఇది ఆయనకు తగిన జీతమేనా అని ప్రశ్నించారు. శాస్త్రీయ విజ్ఞానం, పరిశోధనలపై సోమనాథ్‌కు ఉన్న ఆసక్తి, నిబద్ధతను వివరిస్తూ ఆయన్ను ప్రశంసలతో ముంచెత్తారు.

హర్ష గోయెంకా ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అనేకమంది నెటిజన్లు తమ స్పందన తెలియజేస్తున్నారు. సోమనాథ్‌కు ఎక్కువ సాలరీ ఇవ్వాలని.. ఆయనలాంటి వాళ్ల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలని పేర్కొంటున్నారు. మరికొంతమంది.రెండున్నర లక్షలు అనేది ప్రాథమిక వేతనం అయి ఉండవచ్చని, ఇతర అలవెన్సన్‌లు కూడా కలపాలని కామెంట్‌ చేస్తున్నారు.

Harsh Goenka's Post On ISRO Chief S Somanath's Monthly Salary Sparks Debate

Here's Tweet

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Sep 12, 2023 08:39 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).