Newdelhi, Nov 5: తనను తాను రిపేర్‌ చేసుకొనే, పాక్షికంగా బయో డీగ్రేడబుల్‌ అయ్యే ప్లాస్టిక్‌ (Plastic) ను జపాన్‌ (Japan) శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. దీన్ని వేడిచేసిన తర్వాత కావాల్సిన రూపంలోకి మార్చుకోవచ్చు. పర్యావరణ హిత ప్లాస్టిక్‌ను అభివృద్ధి చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో జపాన్‌ కు చెందిన టోక్యో యూనివర్సిటీ పరిశోధకులు వ్రిటిమర్‌ ఎపోక్సీ రెజీన్‌ ఆధారంగా సరికొత్త ప్లాస్టిక్‌ రూపొందించారు. ఇది సాధారణ ప్లాస్టిక్‌ కంటే బలంగా ఉంటుంది. అంతేకాదు తనకు తాను మరమ్మతు చేసుకుంటుంది. సముద్ర జలాల్లో కలిస్తే బయోడీగ్రేడబుల్‌ అయ్యి సముద్ర జీవులకు ఆహారం అవుతుంది.

Baby Girl Survives Miraculously: ముగ్గురు పిల్లలతో కలిసి చెరువులోకి దూకిన తల్లి.. అనూహ్యంగా ప్రాణాలతో బయటపడిన ఆరు నెలల పసి పాప

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)