SpaceX Starship explode: ఎలాన్‌ మస్క్‌కు మరో షాక్.. పేలిన స్పేస్ ఎక్స్ స్టార్‌షిప్ రాకెట్, జనాలున్న స్థలాల్లోనే పడిన శకలాలు, వీడియో ఇదిగో

టెస్లా సీఈవో ఎలాన్ మస్క్‌కు బిగ్ షాక్‌. మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్టార్ షిప్ రాకెట్ పేలిపోయింది

SpaceX Starship explode: ఎలాన్‌ మస్క్‌కు మరో షాక్.. పేలిన స్పేస్ ఎక్స్ స్టార్‌షిప్ రాకెట్, జనాలున్న స్థలాల్లోనే పడిన శకలాలు, వీడియో ఇదిగో
Big shock to Elon Musk.. Space X Starship rocket explode(X)

టెస్లా సీఈవో ఎలాన్ మస్క్‌కు(Elon Musk) బిగ్ షాక్‌. మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్టార్ షిప్ రాకెట్ పేలిపోయింది(Starship rocket explode). ప్రయోగించిన కొద్ది నిమిషాలకే నియంత్రణ కొల్పోయి బ్లాస్ట్ అయింది. పేలడమే కాదు జనాలున్న స్థానాల్లో పడగా ఎవరికి ప్రమాదం జరగలేదు.

403 అడుగుల పొడవు (123మీటర్లు) ఉన్న ఈ రాకెట్ టెక్సాస్ నుంచి బయలుదేరి తొలిదశలో విజయవంతంగా టేకాఫ్ అయింది(Musk Starship rocket explode). కానీ అంతరిక్ష నౌక దాని ముందుగా నిర్ణయించిన మార్గంలో ముందుకు సాగలేకపోయింది. ఫలితంగా నియంత్రణ కోల్పోయి పేలిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

 డోనాల్డ్ ట్రంప్ దూకుడు! పాక్, ఆఫ్టనిస్తాన్‌పై ట్రావెల్ బ్యాన్‌ విధించే యోచన, వచ్చేవారమే అమల్లోకి వస్తుందని కథనాలు 

ఈ ఘటనతో మయామి, ఫోర్ట్ లాడర్ డేల్, పామ్ బీచ్, ఓర్లాండ్ విమానాశ్రయాల్లో విమానాలు తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రయోగం వైఫల్యంపై పూర్తి దర్యాప్తు చేస్తున్నామని స్పేస్ ఎక్స్ అనౌన్స్ చేసింది.

Big shock to Elon Musk.. Space X Starship rocket explode

 

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Mar 07, 2025 10:22 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).