Brazil: అందాల పోటీల్లో భార్యకు రెండో స్థానం, కిరీటాన్ని నేలకేసి బద్దలు కొట్టిన ఆమె భర్త, అన్యాయం జరిగిందంటూ ఆవేదన, వీడియో ఇదిగో..
అందాల పోటీల్లో (Beauty Pageant ) తన భార్య రెండో స్థానంలో నిలవడాన్ని తట్టుకోలేని ఓ వ్యక్తి కిరీటాన్ని (Crown) నేలకేసి కొట్టాడు. ఈ షాకింగ్ ఘటన బ్రెజిల్ (Brazil )లో మిస్ గే మాటో గ్రాసో 2023 (Miss Gay Mato Grosso 2023) అందాల పోటీల్లో చోటు చేసుకుంది.
అందాల పోటీల్లో (Beauty Pageant ) తన భార్య రెండో స్థానంలో నిలవడాన్ని తట్టుకోలేని ఓ వ్యక్తి కిరీటాన్ని (Crown) నేలకేసి కొట్టాడు. ఈ షాకింగ్ ఘటన బ్రెజిల్ (Brazil )లో మిస్ గే మాటో గ్రాసో 2023 (Miss Gay Mato Grosso 2023) అందాల పోటీల్లో చోటు చేసుకుంది. పలువురు మహిళలు ఈ పోటీల్లో పాల్గొని తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. చివరకు నథాలీ బెకర్ (Nathally Becker), ఇమ్మాన్యుయెల్ బెలీని (Emannuelly Belini) ఫైనల్‌కు చేరుకున్నారు.
వీరిద్దరిలో బెలీని అందాల పోటీల్లో విజేతగా నిలిచింది. ఈ క్రమంలో ఆమెకు కిరీటాన్ని పెట్టేలోపే.. ఊహించని పరిణామం చోటు చేసుకుంది. తన భార్య రెండో స్థానంలో నిలవడాన్ని తట్టుకోలేక అక్కడే ఉన్న నథాలీ బేకర్ భర్త ఆగ్రహంతో ఊగిపోయాడు. తన భార్యకు అన్యాయం జరిగిందంటూ విజేతకు పెట్టబోయిన కిరీటాన్ని లాక్కుని రెండు సార్లు నేలకేసి కొట్టాడు. అక్కడున్నవారిపై అరుస్తూ.. తన భార్యను పక్కకు లాక్కెళ్లాడు. వీడియో ఇదిగో..
Video
Revolta na final do concurso Miss Brasil Gay 2023. Torcedor arranca coroa da vencedora e joga no chão durante a cerimônia de premiação. pic.twitter.com/rb6duFvAEn
— Bruno Guzzo® (@brunoguzzo) May 28, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jun 01, 2023 12:20 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

