జపాన్‌లో స్వల్ప వ్యవధిలోనే భూమి రెండుసార్లు కంపించింది. రిక్టర్ స్కేల్‌పై ఓసారి 7.1, మరోసారి 6.9 తీవ్రతతో భూకంపం వచ్చింది. జపాన్ దక్షిణ తీరంలో భూకంపం సంభవించడంతో సునామీ హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి. జపాన్‌లోని దక్షిణ ప్రధాన ద్వీపం క్యుషు తూర్పు తీరంలో దాదాపు 30 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు జపాన్ వాతావరణ సంస్థ తెలిపింది.  బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధానిగా యూనస్..15 మంది సభ్యులతో ప్రభుత్వ ఏర్పాటు, నేడే బాధ్యతల స్వీకరణ, భారత్‌లోకి చొరబడేందుకు ప్రజల ప్రయత్నం

క్యుషు దక్షిణ తీరం, సమీపంలోని షికోకు ద్వీపంలో అలలు 1 మీటర్ ఎత్తు వరకు ఎగిసిపడే అవకాశాలు ఉన్నాయని సునామీ హెచ్చరికను జారీ చేసింది.సమీపంలోని మియాజాకి విమానాశ్రయంలో కిటికీలు ధ్వంసమైనట్లు ఎన్‌హెచ్‌కే పబ్లిక్ టెలివిజన్ తెలిపింది. జపాన్ నార్త్ సెంట్రల్ రీజియన్‌లో జనవరి 1న సంభవించిన భూకంపంతో 240 మంది చనిపోయారు.

Here's Videos

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)