బంగ్లాదేశ్‌లో ఉద్యోగాల రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మొదలైన ఉద్యమంతో రాజకీయ అస్థిరత ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ ఉద్యమం హింసాత్మకంగా మారింది. వేలాది మంది నిరసనకారులు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నారు. ఆర్మీ రంగంలోకి దిగినప్పటికీ శాంతి భద్రతలు అదుపులోకి రానట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో బంగ్లాలోని భారత దౌత్యాధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. వీసా దరఖాస్తు కేంద్రాలను నిరవధికంగా మూసివేస్తున్నట్లు (Indian Visa Centres closed) ప్రకటించారు.  బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధానిగా యూనస్..15 మంది సభ్యులతో ప్రభుత్వ ఏర్పాటు, నేడే బాధ్యతల స్వీకరణ, భారత్‌లోకి చొరబడేందుకు ప్రజల ప్రయత్నం

బంగ్లా వ్యాప్తంగా అన్ని వీసా దరఖాస్తు సెంటర్లను మూసివేస్తున్నట్లు వెల్లడించారు. తదుపరి నోటీసులు వచ్చేంత వరకూ అన్ని సెంటర్లూ మూసే ఉంటాయని స్పష్టం చేశారు. తదుపరి దరఖాస్తు తేదీపై ఎస్‌ఎంఎస్‌ ద్వారా సమాచారమివ్వనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు భారత వీసా కోసం దరఖాస్తు చేసుకునే ఆన్‌లైన్‌ పోర్టల్‌లో సందేశం పెట్టారు. నేడు బెల్‌ అవార్డు గ్రహీత మహమ్మద్‌ యూనస్‌ (Muhammad Yunus) నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం కొలువదీరనుంది.

Here's News

(SocialLY brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user's social media account and LatestLY Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of LatestLY, also LatestLY does not assume any responsibility or liability for the same.)