Hana-Rawhiti Maipi-Clarke: వీడియో ఇదిగో, పార్లమెంట్‌లో 21 ఏళ్ల మహిళా ఎంపీ ప్రసంగానికి ఆశ్చర్యపోయిన మిగతా ఎంపీలు, షాకై ఆమెను అలాగే చూస్తుండిపోయిన సభ్యులు
న్యూజిలాండ్‌లోని ఓ పార్లమెంటు సభ్యురాలు చేసిన శక్తివంతమైన ప్రసంగానికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. కేవలం 21 సంవత్సరాలు వయసు గల హనా-రౌహితీ మైపి-క్లార్క్ అనే యువ ఎంపీ గత నెలలో ఉద్వేగభరితమైన ప్రసంగం చేసింది.
- Read in
- తెలుగు
న్యూజిలాండ్‌లోని ఓ పార్లమెంటు సభ్యురాలు చేసిన శక్తివంతమైన ప్రసంగానికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. కేవలం 21 సంవత్సరాలు వయసు గల హనా-రౌహితీ మైపి-క్లార్క్ అనే యువ ఎంపీ గత నెలలో ఉద్వేగభరితమైన ప్రసంగం చేసింది. గత నెలలో ఉద్వేగభరితమైన ప్రసంగంలో మైపి-క్లార్క్ సాంప్రదాయ 'హాకా' లేదా 'యుద్ధం' ప్రదర్శించారు.
ఇది మావోరీ హాకా అనే సాంస్కృతిక ప్రదర్శన. హాకా యొక్క సాంప్రదాయ మావోరీ ప్రదర్శన న్యూజిలాండ్ వాసులందరికీ గర్వకారణం. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శించబడుతుంది, ఆల్ బ్లాక్స్, న్యూజిలాండ్ డిఫెన్స్ ఫోర్స్ ద్వారా అత్యంత ప్రసిద్ధి చెందింది. ఆమెస్పీచ్ సందర్భంగా ఓటర్లకు వాగ్దానం చేశారు. న్యూజిలాండ్ హెరాల్డ్ ప్రకారం, "నేను మీ కోసం చనిపోతాను ... అలాగే నేను మీ కోసం జీవిస్తాను" అని ఆమె చెప్పింది.
170 ఏళ్లలో న్యూజిలాండ్‌లో అత్యంత పిన్న వయస్కురాలైన ఎంపీ. 2008 నుండి హౌరాకి వైకాటో సీటుకు ప్రాతినిధ్యం వహిస్తోంది. తనను తాను రాజకీయ నాయకురాలిగా చూడడం లేదని, మావోరీ భాష యొక్క సంరక్షకురాలిగా మావోరీ యొక్క కొత్త జనరేషన్ యొక్క స్వరాన్ని వినిపించాల్సిన అవసరం ఉందని నమ్ముతున్నానని చెప్పింది.మైపీ-క్లార్క్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో 20,000 మంది, టిక్‌టాక్‌లో మరో 18,500 మంది ఫాలోవర్లు ఉన్నారు.
Here's Her Speech Video
New Zealand natives' speech in parliament pic.twitter.com/OkmYNm58Ke
— Enez Özen | Enezator (@Enezator) January 4, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 05, 2024 06:06 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

