దుండగుడి కాల్పుల్లో స్లొవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో తీవ్రంగా గాయపడ్డారు. హాండ్లోవాలో మంత్రిమండలి సమావేశంలో పాల్గొని తిరిగివస్తున్న సమయంలో ప్రధానిపై ఓ దుండగుడు కాల్పులకు పాల్పడినట్లు తెలుస్తోంది. పలుమార్లు కాల్పులు జరపడంతో ప్రధానికి పొట్ట, తల భాగంలో గాయాలయ్యాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆయనను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్న ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనను ఆ దేశ అధ్యక్షుడు జుజానా కాపుటోవా ఖండించారు. ప్రధాని ఫికో త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మరోవైపు పోలీసులు కాల్పులు జరిపిన నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Here's Video
⚡️⚡️⚡️ The first minutes after the attack on Robert #Fico - the prime minister's security guards evacuate him to his motorcade while eyewitnesses hold the shooter
According to preliminary information from Slovak media, Fico was shot multiple times. One to the abdomen, one to the… pic.twitter.com/vhcYPPjjlg
— NEXTA (@nexta_tv) May 15, 2024
Official statement on Slovakia PM Fico:
"He was shot multiple times and is currently in a life-threatening condition. At this moment he's being transported by helicopter to Banská Bystrica, because it would take too long to get to Bratislava ... The next few hours will decide."
— BNO News Live (@BNODesk) May 15, 2024
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)