రష్యాలో బీచ్‌లో ఈదుతున్న యువకుడ్ని సొరచేప తినేసింది. ఈజిప్ట్‌లోని హుర్ఘదా బీచ్‌ రిసార్ట్‌ వద్ద జరిగిన ఈ సంఘటన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. రష్యాకు చెందిన 23 ఏళ్ల వ్లాదిమిర్ పోపోవ్ తన కుటుంబంతో కలిసి ఈజిప్ట్‌ను సందర్శించాడు.ఎర్ర సముద్రం తీరంలోని రిసార్ట్‌లో బస చేసిన అతడు గురువారం ప్రియురాలితో కలిసి బీచ్‌లో ఈత కొట్టాడు. ఇంతలో ఒక టైగర్‌ షార్క్‌ ఆ బీచ్‌లో కనిపించింది.ఆ షార్క్‌ అంతలోనే వ్లాదిమిర్ పోపోవ్‌ను సమీపించి అతడిపై దాడి చేసింది.

ఆ యువకుడ్ని నమిలిన షార్క్‌ అనంతరం అమాంతం మింగేసింది. దీంతో అక్కడి నీరంతా రక్తంతో ఎర్రగా మారింది. అయితే ఆ యువకుడి ప్రియురాలు మాత్రం షార్క్‌ దాడి నుంచి తప్పించుకుంది. ఈదుకుంటూ ఒడ్డుకు చేరింది. వీడియో ఇదిగో..

Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)