Temple Vandalized in Canada: కెనడాలో హిందూ ఆలయాలపై దాడి, మోదీని ఉగ్రవాదిగా ప్రకటించాలంటూ కెనడా భాషలో రాతలు, దర్యాప్తు చేస్తున్న పోలీసులు

బుధవారం రాత్రి ఓంటారియో (Ontario) లోని ఓ హిందూ దేవాలయం ప్రహరీగోడపై ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు భారత్‌కు వ్యతిరేకంగా అమర్యాదకర రాతలు రాశారు. ‘హిందూస్థాన్‌ ముర్దాబాద్’ (Hindustan Murdabad), ‘మోదీని ఉగ్రవాదిగా ప్రకటించాలి’ (Declare Modi terrorist (BBC)) అంటూ స్పెయర్‌తో పెయింట్ చేశారు.

Temple Vandalized in Canada: కెనడాలో హిందూ ఆలయాలపై దాడి, మోదీని ఉగ్రవాదిగా ప్రకటించాలంటూ కెనడా భాషలో రాతలు, దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Temple Vandalised With Anti-India Graffiti In Canada (Photo-Video Grab)

కెన‌డా (Canada )లో హిందూ ఆల‌యాల‌ (Hindu temples)పై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల మిస్సిసాగ‌లోని రామ మందిరం గోడ‌ల‌పై ఇండియాకు వ్యతిరేకంగా గ్రాఫిటీ బొమ్మలు, బ్రాంప్టన్‌లోని గౌరీ శంకర్‌ మందిరంపై విద్వేష పూరిత వ్యాఖ్యలు రాసిన విషయం తెలిసిందే. తాజాగా బుధవారం రాత్రి ఓంటారియో (Ontario) లోని ఓ హిందూ దేవాలయం ప్రహరీగోడపై ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు భారత్‌కు వ్యతిరేకంగా అమర్యాదకర రాతలు రాశారు. ‘హిందూస్థాన్‌ ముర్దాబాద్’ (Hindustan Murdabad), ‘మోదీని ఉగ్రవాదిగా ప్రకటించాలి’ (Declare Modi terrorist (BBC)) అంటూ స్పెయర్‌తో పెయింట్ చేశారు.

ఇందుకు సంబంధించిన దృశ్యాలు ఆలయం ఆవరణలోని సీసీటీవీ ఫుటేజ్‌లో (CCTV Footage) రికార్డయ్యాయి. ఈ ఘటనను ద్వేషపూరిత ఘటనగా భావించి దర్యాప్తు చేస్తున్నట్లు విండ్సర్ పోలీసులు (Windsor police) వెల్లడించారు.ఈ మేరకు సీసీటీవీ దృశ్యాలను పోలీసులు ట్విట్టర్‌ ద్వారా విడుదల చేశారు.

Here's Video

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Apr 06, 2023 03:33 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).