IPL 2023: రూ.18.50 కోట్లు పెట్టి కొంటే ఇక్కడ అట్టర్ ఫ్లాప్, అక్కడ మాత్రం ఫోర్లు, సిక్సర్లతో బౌలర్లను హడలెత్తించాడు, టీ20 బ్లాస్ట్‌లో సామ్‌ కర్రన్‌ విశ్వరూపం

పంజాబ్‌ కింగ్స్‌ ఆల్‌రౌండర్‌ సామ్‌ కర్రన్‌ ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక ధర (2023లో రూ. 18.50 కోట్లు) పలికిన ఆటగాడిగా రికార్డు సృష్టించిన సంగతి విదితమే. అయితే అనుకున్నంతగా రాణించలేకపోవడంతో పంజాబ్ ఇంటి దారి పట్టింది. ఈ ఆటగాడు ఇంగ్లండ్‌ వేదికగా జరుగుతున్న టీ20 బ్లాస్ట్‌లో చెలరేగిపోయాడు

IPL 2023: రూ.18.50 కోట్లు పెట్టి కొంటే ఇక్కడ అట్టర్ ఫ్లాప్, అక్కడ మాత్రం ఫోర్లు, సిక్సర్లతో బౌలర్లను హడలెత్తించాడు, టీ20 బ్లాస్ట్‌లో సామ్‌ కర్రన్‌ విశ్వరూపం
Sam Curran (Photo-Twitter/IPL)

పంజాబ్‌ కింగ్స్‌ ఆల్‌రౌండర్‌ సామ్‌ కర్రన్‌ ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక ధర (2023లో రూ. 18.50 కోట్లు) పలికిన ఆటగాడిగా రికార్డు సృష్టించిన సంగతి విదితమే. అయితే అనుకున్నంతగా రాణించలేకపోవడంతో పంజాబ్ ఇంటి దారి పట్టింది. ఈ ఆటగాడు ఇంగ్లండ్‌ వేదికగా జరుగుతున్న టీ20 బ్లాస్ట్‌లో చెలరేగిపోయాడు. నిన్న (మే 25) మిడిల్‌సెక్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మెరుపు అర్ధశతకంతో విరుచుకుపడిన సామ్‌ (47 బంతుల్లో 68; 7 ఫోర్లు, 2 సిక్సర్లు).. అన్న టామ్‌ కర్రన్‌ (33 బంతుల్లో 50; 8 ఫోర్లు) సహకారంతో తన జట్టు సర్రేను గెలిపించాడు.

టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన సర్రే.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన మిడిల్‌సెక్స్‌.. విల్‌ జాక్స్‌ (3/17), గస్‌ అట్కిన్సన్‌ (3/20), సునీల్‌ నరైన్‌ (2/37), సీన్‌ అబాట్‌ (1/22) ధాటికి 14.5 ఓవర్లలో 126 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది.మిడిల్‌సెక్స్‌ ఇన్నింగ్స్‌లో మ్యాక్స్‌ హోల్డెన్‌ (43), పీటర్‌ మలాన్‌ (30), జాన్‌ సిమ్సన్‌ (15), జో క్రాక్నెల్‌ (12) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. బంతితో ఇరగదీసిన విల్‌ జాక్స్‌ బ్యాటింగ్‌లోనూ (22 బంతుల్లో 43; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) సత్తా చాటి ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు గెలుచుకున్నాడు.

ప్లే ఆఫ్స్ లో లక్నోను చిత్తు చేసిన రోహిత్ సేన, ఫైనల్ కు మరో అడుగు దూరంలో నిలిచిన ముంబై ఇండియన్స్..

ఈ నేపథ్యంలో భారీ సొమ్మునిచ్చిన ఐపీఎల్‌లో ఏం చేయలేకపోయాడు కానీ, సొంత దేశ లీగ్‌లో మాత్రం ఇరగదీస్తున్నాడని ఐపీఎల్ అభిమానులు మండిపడుతున్నారు. ఐపీఎల్‌ 2023లో 18.50 కోట్లు పెడితే ఒక్క మ్యాచ్‌లో కూడా పంజాబ్‌ను గెలిపించలేకపోయిన సామ్‌.. టీ20 బ్లాస్ట్‌లో వచ్చీ రాగానే అన్న సహకారంతో తన జట్టును గెలిపించుకున్నాడని ధ్వజమెత్తుతున్నారు.

ఐపీఎల్‌-2023లో 14 మ్యాచ్‌లు ఆడిన సామ్‌ కర్రన్‌.. 27.60 సగటున, 135.96 స్ట్రయిక్‌ రేట్‌తో ఒక్క హాఫ్‌ సెంచరీ సాయంతో 276 పరుగులు చేశాడు. అలాగే 10 వికెట్లు కూడా పడగొట్టాడు. సామ్‌ తీసుకున్న మొత్తంతో పోలిస్తే అతని ప్రదర్శన రవ్వంత కూడా కాదు. 10 లక్షల కనీస ధర పెట్టిన ఆటగాళ్లు సైతం అందివచ్చిన అవకాశాలను ఒడిసిపట్టుకుని ఇరగదీస్తున్న వేల కోట్లు కుమ్మరించి కొనుక్కున్న సామ్‌ తేలిపోవడం నిజంగా బాధాకరం.

(The above story first appeared on LatestLY on May 26, 2023 03:28 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).