Babar New Record: కోహ్లీ రికార్డు బద్దలు కొట్టిన పాకిస్థాన్ కెప్టెన్ బాబర్.. టీ20ల్లో వేగంగా 8 వేల మార్కు దాటిన రెండో ఆటగాడి రికార్డు.. విరాట్ ను మూడో స్థానానికి నెట్టిన పాకిస్థాన్ కెప్టెన్.. ఇంగ్లండ్ తో రెండో టీ20లో పాక్ ఘన విజయం
పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ టీ20ల్లో భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ ఫార్మాట్ లో వేగంగా 8000 పరుగులు చేసిన బ్యాటర్ గా కోహ్లీ అధిగమించి రెండో స్థానానికి దూసుకెళ్లాడు.
NewDelhi, September 23: పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ (Babar) ఆజమ్ టీ20ల్లో (T20) భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ (Kohli) రికార్డును బద్దలు కొట్టాడు. ఈ ఫార్మాట్ లో వేగంగా 8000 పరుగులు చేసిన బ్యాటర్ గా కోహ్లీ అధిగమించి రెండో స్థానానికి (Second Place) దూసుకెళ్లాడు. కోహ్లీ 243 ఇన్నింగ్స్ ల్లో ఈ ఘనత సాధించగా.. బాబర్ ఆజమ్ 218 ఇన్నింగ్స్ ల్లోనే 8 వేల పరుగుల మార్కు చేరుకున్నాడు. వెస్టిండీస్ విధ్వంసకర వీరుడు క్రిస్ గేల్ 214 ఇన్నింగ్స్ ల్లో 8 వేల పరుగుల మైలురాయి చేరుకొని అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడు.
గురువారం రాత్రి కరాచీలో ఇంగ్లండ్ తో జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో సెంచరీ చేయడం ద్వారా బాబర్.. కోహ్లీ రికార్డును అధిగించాడు. ఈ పోరులో బాబర్ (110 నాటౌట్) సెంచరీకి తోడు మహ్మద్ రిజ్వాన్ (88 నాటౌట్) సత్తా చాటడంతో పాక్ 10 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ ను ఓడించింది. తద్వారా మూడు మ్యాచ్ ల సిరీస్ ను 1-1తో సమం చేసింది. టాస్ నెగ్గిన ఇంగ్లండ్ తొలుత 20 ఓవర్లలో 199/5 స్కోరు చేసింది. కెప్టెన్ మొయిన్ అలీ (55 నాటౌట్), బెన్ డంకెట్ (43) సత్తా చాటారు. అనంతరం బాబర్, రిజ్వాన్ ను తొలి వికెట్ కు అజేయంగా 203 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పడంతో పాక్ ఒక్క వికెట్ కోల్పోకుండా మరో 3 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. ఈ క్రమంలో టీ20ల్లో తొలి వికెట్ కు అత్యధిక పరుగుల భాగస్వామ్యం (203) నమోదు చేసిన ఓపెనర్లుగా బాబర్, రిజ్వాన్ రికార్డు నెలకొల్పారు. గతేడాది దక్షిణాఫ్రికాపై 197 పరుగులతో నెలకొల్పిన తమ సొంత రికార్డునే ఈ ఇద్దరూ బద్దలు కొట్టారు.
(The above story first appeared on LatestLY on Sep 23, 2022 09:30 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

