Shoaib Akhtar: నీకంత సీన్ లేదని ఇద్దరు ఆంటీలు నన్ను రెచ్చగొట్టేవారు, వారి వల్లే నాలో కసి పెరిగి మరింతగా ప్రాక్టీస్ చేశా, తన కెరీర్ అనుభవాలను చెప్పుకొచ్చిన పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్
రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌గా ప్రసిద్ధి చెందిన పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ (Former Pakistan Speedster Shoaib Akhtar) తన కెరీర్ లో జరిగిన ఓ సంచలన విషయాన్ని బయటపెట్టాడు. ఓ స్పోర్ట్స్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ఫాస్ట్ బౌలర్ మాట్లాడుతూ తాను స్టార్ క్రికెటర్‌గా ఎదగడానికి ఇద్దరు ఆంటీలు (opens up on story of two aunts) కారణమని తెలిపాడు.
రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌గా ప్రసిద్ధి చెందిన పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ (Former Pakistan Speedster Shoaib Akhtar) తన కెరీర్ లో జరిగిన ఓ సంచలన విషయాన్ని బయటపెట్టాడు. ఓ స్పోర్ట్స్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ఫాస్ట్ బౌలర్ మాట్లాడుతూ తాను స్టార్ క్రికెటర్‌గా ఎదగడానికి ఇద్దరు ఆంటీలు (opens up on story of two aunts) కారణమని తెలిపాడు. ప్రతి రోజు వారు తనని వారి మాటలతో రెచ్చగొట్టేవారని, దాంతోనే మరింత కసిగా ప్రాక్టీస్ చేసేవాడినని చెప్పుకొచ్చాడు. వారు రోజు తనని ఎక్కడికి వెళ్తున్నావని అడిగేవారని, నేను స్టార్ అవుదామని వెళ్తున్నా అని చెప్పేవాడినని అయితే వారు ఎగతాళిగా చూసే వారని గతాన్ని గుర్తు చేసుకున్నాడు.
వారి మాటల్లో ఉద్దేశం నాకు నిధానంగా బోధ పడిందని అక్తర్ భావోద్వేగానికి లోనయ్యాడు. నేను స్టార్ ప్లేయర్ కావాలనే వారు నన్ను అలా రెచ్చగొట్టేవారని తెలిసిందని అన్నాడు. ఆ ఇద్దరు మహిళలే కాకుండా చుట్టు పక్కన వాళ్లు కూడా తనను ఎగతాళి చేసేవారని, నీకు క్రికెటర్ అయ్యేంత సీన్ లేదని రెచ్చగొట్టేవారని, వారి మాటలు తనలో మరింత కసిని (taunts pushed him to make big in career) రగిల్చాయని గుర్తు చేసుకున్నాడు.
అయితే, నన్ను రెచ్చగొట్టినవారంతా నేను ఉన్నత స్థాయికి చేరాలనే అలా ప్రవర్తించేవారని తనకు తరువాత తెలిసిందని చెప్పుకొచ్చాడు. ఇదంతా తన కెరీర్ ఆరంభంలో జరిగిన కథ అని అక్తర్ ఈ సందర్భంగా పేర్కొన్నాడు. పాకిస్తాన్ తరఫున 46 టెస్ట్‌లు, 163 వన్డేలు, 15 టీ20లు ఆడిన అక్తర్.. మొత్తంగా 444 వికెట్లు పడగొట్టాడు.
(The above story first appeared on LatestLY on Aug 28, 2021 12:57 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

