GT vs KKR IPL 2023: జీటీని గెలిపించని రషీద్ ఖాన్ హ్యట్రిక్, 5 సిక్సర్లతో విరుచుకుపడిన రింకూసింగ్, వరుసగా రెండో విజయం నమోదు చేసిన కోల్‌కతా నైట్‌ రైడర్స్‌

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 16వ సీజన్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ వరుసగా రెండో విజయం నమోదు చేసుకుంది. ఆదివారం డబుల్‌ హెడర్‌లో భాగంగా జరిగిన తొలి పోరులో కోల్‌కతా 3 వికెట్ల తేడాతో గుజరాత్‌ టైటాన్స్‌పై విజయం సాధించింది.

GT vs KKR IPL 2023: జీటీని గెలిపించని రషీద్ ఖాన్ హ్యట్రిక్, 5 సిక్సర్లతో విరుచుకుపడిన రింకూసింగ్, వరుసగా రెండో విజయం నమోదు చేసిన కోల్‌కతా నైట్‌ రైడర్స్‌
Rinku Singh celebrates with KKR teammates (Photo credit: Twitter @IPL)

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 16వ సీజన్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ వరుసగా రెండో విజయం నమోదు చేసుకుంది. ఆదివారం డబుల్‌ హెడర్‌లో భాగంగా జరిగిన తొలి పోరులో కోల్‌కతా 3 వికెట్ల తేడాతో గుజరాత్‌ టైటాన్స్‌పై విజయం సాధించింది. ఉత్కంతభరితో పోరులో రింకూ సింగ్‌ (21 బంతుల్లో 48 నాటౌట్‌; ఒక ఫోర్‌, 6 సిక్సర్లు).. సిక్సర్లతో రెచ్చిపోవడంతో కోల్‌కతా విక్టరీ నమోదు చేసింది.

మొదట బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. ‘త్రి డైమెన్షన్‌ ప్లేయర్‌’ విజయ్‌ శంకర్‌ (24 బంతుల్లో 63 నాటౌట్‌; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) అదిరిపోయే అర్ధశతకం నమోదు చేసుకోగా.. సాయి సుదర్శన్‌ (38 బంతుల్లో 53; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆకట్టుకున్నాడు. కోల్‌కతా బౌలర్లలో సునీల్‌ నరైన్‌ 3 వికెట్లు పడగొట్టాడు.

వీడియో ఇదిగో, రింకూసింగ్ 5 సిక్సర్ల దెబ్బకి ఏడ్చేసిన జుహీ చావ్లా, జట్టు విజయం సాధించగానే భావోద్వేగానికి గురైన హీరోయిన్

అనంతరం లక్ష్యఛేదనలో కోల్‌కతా 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 207 పరుగులు చేసింది. ఆల్‌రౌండర్‌ వెంకటేశ్‌ అయ్యర్‌ (40 బంతుల్లో 83; 8 ఫోర్లు, 5 సిక్సర్లు) యాంకర్‌ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకోగా.. కెప్టెన్‌ నితీశ్‌ రాణా (29 బంతుల్లో 45; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించాడు. అయితే కోల్‌కతాను గెలిపించింది మాత్రం రింకూ సింగ్‌ సునామీ ఇన్నింగ్సే. గుజరాత్‌ బౌలర్లలో రషీద్‌ ఖాన్‌ హ్యాట్రిక్‌ నమోదు చేసుకున్నాడు. రింకూ సింగ్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది.

భారీ లక్ష్యఛేదనలో కోల్‌కతా ఆరంభం నుంచి ఆకట్టుకున్నా.. 17వ ఓవర్లో గుజరాత్‌ స్టాండిన్‌ కెప్టెన్‌ రషీద్‌ ఖాన్‌ మ్యాచ్‌ను మలుపుతిప్పాడు. వరుస బంతుల్లో మిస్సైల్‌ మ్యాన్‌ రస్సెల్‌ (0)తో పాటు సునీల్‌ నరైన్‌ (0), శార్దూల్‌ ఠాకూర్‌ (0)ను ఔట్‌ చేయడంతో నైట్‌ రైడర్స్‌ పరాజయం ఖాయమనిపించింది.కాని 19 ఓవర్‌ చివరి రెండు బంతులకు 6,4 కొట్టిన రింకూ.. యష్‌ దయాల్‌ వేసిన చివరి ఓవర్లో అరాచకానికి అర్ధం మార్చాడు. తొలి బంతికి ఉమేశ్‌ యాదవ్‌ సింగిల్‌ తీసి ఇవ్వగా.. అక్కడి నుంచి వరుసగా ఐదు బంతులను అతడు సిక్సర్లుగా మలిచి కోల్‌కతాను గెలిపించాడు. రింకూ సింగ్‌ ఎదుర్కొన్న చివరి ఏడు బంతులకు 6,4,6,6,6,6,6 కొట్టడం గమనార్హం.

సంక్షిప్త స్కోర్లు

గుజరాత్‌: 204/4 (విజయ్‌ శంకర్‌ 63 నాటౌట్‌, సుదర్శన్‌ 53; నరైన్‌ 3/33),

కోల్‌కతా: 207/7 (వెంకటేశ్‌ 83, రింకూ సింగ్‌ 48 నాటౌట్‌; రషీద్‌ ఖాన్‌ 3/37).

(The above story first appeared on LatestLY on Apr 10, 2023 12:17 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).