ICC Introduces Stop Clock: క్రికెట్‌లో స్టాప్‌ క్లాక్‌ పేరుతో కొత్త రూల్‌, ఓవర్‌కు ఓవర్‌కు మధ్య 60 సెకన్లు మాత్రమే గ్యాప్, ఆలస్యమైతే బౌలింగ్‌ జట్టుకు ఐదు పరుగులు పెనాల్టీ

అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) ఈ ఏడాది డిసెంబర్‌ నుంచి పురుషుల వన్డే, టీ20 క్రికెట్‌లో స్టాప్‌ క్లాక్‌" పేరుతో కొత్త రూల్‌ను ప్రవేశపెట్టనుంది. ఈ నిబంధనను వచ్చే ఏడాది (2024) ఏప్రిల్‌ వరకు ప్రయోగాత్మకంగా అమలు చేస్తామని ఐసీసీ వెల్లడించింది.

ICC Introduces Stop Clock: క్రికెట్‌లో స్టాప్‌ క్లాక్‌ పేరుతో కొత్త రూల్‌, ఓవర్‌కు ఓవర్‌కు మధ్య 60 సెకన్లు మాత్రమే గ్యాప్, ఆలస్యమైతే బౌలింగ్‌ జట్టుకు ఐదు పరుగులు పెనాల్టీ
ICC (Photo-ANI)

అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) ఈ ఏడాది డిసెంబర్‌ నుంచి పురుషుల వన్డే, టీ20 క్రికెట్‌లో స్టాప్‌ క్లాక్‌" పేరుతో కొత్త రూల్‌ను ప్రవేశపెట్టనుంది. ఈ నిబంధనను వచ్చే ఏడాది (2024) ఏప్రిల్‌ వరకు ప్రయోగాత్మకంగా అమలు చేస్తామని ఐసీసీ వెల్లడించింది.

స్టాప్‌ క్లాక్‌ నిబంధన ఏంటంటే.. ఐసీసీ కొత్తగా ఓవర్‌కు ఓవర్‌కు మధ్య 60 సెకెన్ల నిర్దిష్ట సమయాన్ని గ్యాప్‌ టైమ్‌గా ఫిక్స్‌ చేసింది. బౌలింగ్‌ జట్టు ఈ సమయంలోపే మరుసటి ఓవర్‌ వేసేందుకు బౌలర్‌ను దించాలి. రెండుసార్లు నిర్దిష్ట వ్యవధి దాటితే మన్నిస్తారు. మూడోసారి ఆలస్యమైతే మాత్రం బౌలింగ్‌ జట్టుకు ఐదు పరుగులు పెనాల్టీగా విధిస్తారు.

లక్నో సూపర్ జెయింట్స్ నుండి తప్పుకున్న గౌతం గంభీర్, తిరిగి మళ్లీ కోల్‌కతా నైట్ రైడర్స్‌లో మెంటార్ పాత్రకు రెడీ

ఈ పరుగులు బ్యాటింగ్‌ టీమ్‌ స్కోర్‌కు యాడ్‌ అవుతాయి. ఫీల్డ్‌ అంపైర్లు స్టాప్‌ క్లాక్‌తో ఈ సమయాన్ని నిర్ధారిస్తారు. అహ్మదాబాద్‌లో నిన్న (నవంబర్‌ 21) జరిగిన ఐసీసీ బోర్డు సమావేశంలో స్టాప్‌ క్లాక్‌ నిబంధన అమలుపై నిర్ణయం తీసుకున్నారు.

(The above story first appeared on LatestLY on Nov 22, 2023 03:16 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).