Virat Kohli Bowling Video: విరాట్‌ కోహ్లి బౌలింగ్ వీడియో ఇదిగో, మూడు బంతులు వేసి రెండు పరుగులు ఇచ్చిన టీమిండియా స్టార్

వరల్డ్‌కప్‌-2023లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌ సందర్భంగా టీమిండియా స్టార్‌ విరాట్‌ కోహ్లి బాల్‌తో రంగంలోకి దిగాడు. వేసిన మూడు బంతుల్లో రెండు పరుగులు ఇచ్చాడు. కథ ఏంటంటే..బంగ్లా ఇన్నింగ్స్‌ తొమ్మిదో ఓవర్‌ సందర్భంగా.. భారత జట్టు సారథి రోహిత్‌ శర్మ.. పేస్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా చేతికి బంతినిచ్చాడు.

Virat Kohli Bowling Video: విరాట్‌ కోహ్లి బౌలింగ్ వీడియో ఇదిగో, మూడు బంతులు వేసి రెండు పరుగులు ఇచ్చిన టీమిండియా స్టార్
Virat Kohli Bowling Video

వరల్డ్‌కప్‌-2023లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌ సందర్భంగా టీమిండియా స్టార్‌ విరాట్‌ కోహ్లి బాల్‌తో రంగంలోకి దిగాడు. వేసిన మూడు బంతుల్లో రెండు పరుగులు ఇచ్చాడు. కథ ఏంటంటే..బంగ్లా ఇన్నింగ్స్‌ తొమ్మిదో ఓవర్‌ సందర్భంగా.. భారత జట్టు సారథి రోహిత్‌ శర్మ.. పేస్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా చేతికి బంతినిచ్చాడు. ఈ క్రమంలో పాండ్యా బౌలింగ్‌లో తొలి బంతికి పరుగులేమీ రాబట్టలేకపోయిన లిటన్‌ దాస్‌ మరుసటి రెండు బంతుల్లో వరుసగా రెండు ఫోర్లు బాదాడు. అయితే, రెండోసారి బౌండరీ దిశగా వెళ్తున్న బంతిని ఆపే క్రమంలో పాండ్యా తన కుడికాలిని అడ్డుపెట్టాడు. ఈ క్రమంలో పట్టుతప్పి జారిపడిపోయాడు.

పాండ్యా నొప్పితో విలవిల్లాడటంతో.. ఓవర్‌ పూర్తి చేసేందుకు రోహిత్‌ శర్మ.. కోహ్లిని పిలిచాడు. ఇక పాండ్యా ఓవర్లో మిగిలిన మూడు బంతుల్లో కేవలం రెండు పరుగులు మాత్రమే ఇచ్చాడు కోహ్లీ. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. వన్డేల్లో ఆఖరిసారిగా.. 2017లో శ్రీలంకతో మ్యాచ్‌లో కోహ్లి బౌలింగ్‌ చేశాడు.

Virat Kohli Bowling Video

Here's Video

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Oct 19, 2023 05:57 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).