2020 Under-19 Cricket World Cup: 5వసారి ప్రపంచకప్ కొట్టేందుకు భారత్ జట్టు రెడీ, అండర్- 19 ప్రపంచకప్ జట్టును ప్రకటించిన బీసీసీఐ, హైదరాబాద్ నుంచి తిలక్ వర్మకి చోటు, కెప్టెన్‌గా ప్రియం గార్గ్
జనవరి 17 నుంచి ఆరంభం కానున్న అండర్-19 ప్రపంచ కప్ టోర్నమెంట్ (Under-19 Cricket World Cup) కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. దక్షిణాఫ్రికా(South Africa)లో అండర్- 19 ప్రపంచకప్ జరగనుంది. ఈ మెగా ఈవెంట్ కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టు(India Team)ను భారత క్రికెట్ నియంత్రణ మండలి సోమవారం ప్రకటించింది.
New Delhi, December 2: జనవరి 17 నుంచి ఆరంభం కానున్న అండర్-19 ప్రపంచ కప్ టోర్నమెంట్ (Under-19 Cricket World Cup) కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. దక్షిణాఫ్రికా(South Africa)లో అండర్- 19 ప్రపంచకప్ జరగనుంది. ఈ మెగా ఈవెంట్ కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టు(India Team)ను భారత క్రికెట్ నియంత్రణ మండలి సోమవారం ప్రకటించింది.
ఉత్తరప్రదేశ్ బ్యాట్స్‌మన్ ప్రియం గార్గ్ (Uttar Pradesh's Priyam Garg) నేతృత్వంలోని భారత జట్టు బరిలోకి దిగనుంది. గ్రూప్- ఏలో భారత్‌తో పాటుగా జపాన్(Japan), న్యూజిలాండ్(New Zealand ), శ్రీలంక (Srilanka) క్రికెట్ జట్లు ప్రత్యర్థి జట్లతో తలపడనున్నాయి. కాగా ఫిబ్రవరి 9న పోచెఫ్‌స్ట్రూంలో ప్రపంచకప్- 2020 ఫైనల్ మ్యాచ్ జరుగనుంది.
వైస్ కెప్టెన్‌గా ధ్రువ్ చంద్ జురెల్ (Dhruv Chand Jurel)భాద్యతలు నిర్వర్తించనున్నాడు. ధ్రువ్ వికెట్ కీపింగ్ కూడా చేస్తాడు. ధ్రువ్‌తో పాటు కుమాల్ కుషాగ్ర(Kumal Kushagra) కూడా జట్టులో వికెట్ కీపర్‌గా ఎంపికయ్యాడు. అండర్-19 ప్రపంచకప్ జట్టులో హైదరాబాద్ ఆటగాడు తిలక్ వర్మకి చోటు దక్కింది. తిలక్ (Hyderabad's Tilak Varma)జట్టులో ప్రముఖ బ్యాట్స్‌మన్‌గా కొనసాగనున్నాడు. తిలక్‌తో పాటు యశస్వి జైస్వాల్, దివ్యాన్ష్ సక్సేనా, శషావత్ రావత్ బ్యాటింగ్ భారాన్ని మోయనున్నారు.
BCCI Tweet
Four-time winner India announce U19 Cricket World Cup squad. Priyam Garg to lead the side. pic.twitter.com/VEIPxe2a2n
— BCCI (@BCCI) December 2, 2019
అండర్-19 విభాగంలో టీమిండియా ఇప్పటికే నాలుగుసార్లు ప్రపంచకప్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. టీమిండియా ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లి నేతృత్వంలోని ఆనాటి అండర్-19 జట్టు భారత్‌కు ప్రపంచకప్ సాధించి పెట్టింది.ఈ క్రమంలోనే ఐదవసారి ప్రపంచకప్ కొట్టాలని భారత్ ఉవ్విళ్లూరుతుంది.
ప్రపంచకప్-2020 అండర్-19 భారత జట్టు:
ప్రియం గార్గ్(కెప్టెన్), ధ్రువ్ జరేల్(వైస్ కెప్టెన్/వికెట్ కీపర్), యశస్వి జైస్వాల్, దివ్యాంశ్ సక్సేనా, శశ్వత్ రావత్, దివ్యాంగ్ జోషి, శుభాంగ్ హెగ్డే, రవి బిష్ణోయి, ఆకాశ్ సింగ్, కార్తిక్ త్యాగి, అథర్వ అంకోలేకర్, కుమార్ కుషాగ్ర(వికెట్ కీపర్), సుశాంత్ మిశ్రా, విద్యాధర్ పాటిల్
(The above story first appeared on LatestLY on Dec 02, 2019 03:00 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

