India Edge Pakistan: పాకిస్తాన్‌ను వెనక్కి నెట్టిన భారత్, మూడు ఫార్మాట్లలో టాప్-3లో ఉన్న ఏకైక జట్టుగా అవతరణ, ఇంగ్లండ్‌తో తొలి వన్డేలో 10 వికెట్ల తేడాతో ఘన విజయం
తొలి వన్డేలో ఇంగ్లండ్‌ను చిత్తు చేయడం ద్వారా టీమిండియా ఐసీసీ తాజా వన్డే ర్యాంకింగ్స్‌లో మూడో స్థానానికి ఎగబాకింది. దీంతో పాటు దాయాది పాక్‌కు కూడా షాకిచ్చింది.
తొలి వన్డేలో ఇంగ్లండ్‌ను చిత్తు చేయడం ద్వారా టీమిండియా ఐసీసీ తాజా వన్డే ర్యాంకింగ్స్‌లో మూడో స్థానానికి ఎగబాకింది. దీంతో పాటు దాయాది పాక్‌కు కూడా షాకిచ్చింది. ఇంగ్లండ్‌పై 10 వికెట్ల భారీ తేడాతో ఘన విజయం సాధించిన రోహిత్ సేన 3 రేటింగ్ పాయింట్లను (108) సాధించి టాప్-3లోకి చేరి, పాక్‌ను నాలుగో స్థానానికి (106) నెట్టింది.
ఈ జాబితాలో న్యూజిలాండ్ (126) టాప్‌లో కొనసాగుతుండగా.. ఇంగ్లండ్ (122) రెండు, భారత్ మూడు, పాకిస్తాన్ నాలుగు, ఆసీస్ ఐదు, సౌతాఫ్రికా ఆరు స్థానాల్లో నిలిచాయి. బంగ్లాదేశ్ (96), శ్రీలంక (92), వెస్టిండీస్ (71), ఆఫ్ఘనిస్తాన్ (69), ఐర్లాండ్ (54) జట్లు వరుసగా 7 నుంచి 11 స్థానాల్లో నిలిచాయి. వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా టాప్ 3లోకి చేరడంతో మూడు ఫార్మాట్లలో టాప్-3లో ఉన్న ఏకైక జట్టుగా నిలిచింది.
ఇంగ్లండ్‌తో తొలి వన్డేలో ఘన విజయం సాధించడంతో 3 మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యంలో వెళ్లింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బట్లర్ సేన.. బుమ్రా (6/19), మహ్మద్ షమీ (3/31) నిప్పులు చెరగడంతో 25.2 ఓవర్లలో 110 పరుగులకే చాపచుట్టేసింది.
జోస్ బట్లర్ (32 బంతుల్లో 30; 6 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలవగా టాప్–6లో నలుగురు బ్యాటర్లు ‘డకౌట్’ అయ్యారు. మొత్తంగా ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో ఐదుగురు క్లీన్‌బౌల్డ్ కావడం విశేషం. అనంతరం రోహిత్ శర్మ (58 బంతుల్లో 76 నాటౌట్; 7 ఫోర్లు, 5 సిక్స్‌లు), శిఖర్ ధవన్ (54 బంతుల్లో 31 నాటౌట్; 4 ఫోర్లు) చెలరేగి ఆడటంతో భారత్ 18.4 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా లక్ష్యాన్ని ఛేదించింది.
(The above story first appeared on LatestLY on Jul 13, 2022 07:07 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

