భారత్‌-ఇంగ్లండ్‌ జట్ల మధ్య తొలి వన్డే సందర్భంగా తండ్రితో పాటు స్టేడియంకు వచ్చిన ఓ చిన్నారి రోహిత్‌ శర్మ సిక్సర్‌ కొట్టిన బంతి తగిలి నొప్పితో విలవిలలాడింది. భారత ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో డేవిడ్ విల్లే వేసిన ఓ బంతిని టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ పుల్ షాట్ ఆడి భారీ సిక్సర్‌గా మలచగా.. రో'హిట్‌' చేసిన ఆ బంతి స్టేడియంలో మ్యాచ్ చూసేందుకు వచ్చిన ఓ చిన్నారికి బలంగా తాకింది.

దీంతో ఆ పాప నొప్పితో విలవిలలాడింది. ఈ విషయాన్ని బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న బెన్ స్టోక్స్ తన సహచరులతో చెప్పగా వారు హిట్ మ్యాన్‌కు జరిగింది వివరించారు. విషయం తెలిసిన రోహిత్‌ చిన్నారి గురించి ఆరా తీసే క్రమంలో బాధను వ్యక్తం చేశాడు. ఈ మధ్యలో ఇంగ్లండ్ ఫిజియోలు చిన్నారికి ప్రథమ చికిత్స అందించడంతో కోలుకుంది. ఈ ఇన్సిడెంట్‌కు సంబంధించిన వివరాలను ఓ అభిమాని సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేయగా వైరల్‌గా మారింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)