IPL 2023: అప్పుడు జట్టుకు దరిద్రం అంటూ వెక్కిరింతలు, ఇప్పుడు బౌలర్లకు చుక్కలు చూపిస్తూ దడపుట్టిస్తున్నాడు, సీఎస్‌కేకు కీలక ఆటగాడిగా మారిన శివమ్ దుబే
ఐపీఎల్-2023 సీజన్ ఆరంభంలో ఆకట్టుకోకపోయినా సీఎస్‌కే ఆటగాడు శివమ్ దుబే.. ఇప్పడు బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. సీఎస్‌కే ప్రతీ విజయంలోనూ దుబే తన వంతు పాత్ర పోషిస్తున్నాడు. తాజాగా చెపాక్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో దుబే కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
ఐపీఎల్-2023 సీజన్ ఆరంభంలో ఆకట్టుకోకపోయినా సీఎస్‌కే ఆటగాడు శివమ్ దుబే.. ఇప్పడు బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. సీఎస్‌కే ప్రతీ విజయంలోనూ దుబే తన వంతు పాత్ర పోషిస్తున్నాడు. తాజాగా చెపాక్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో దుబే కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
కేవలం 12 బంతులు మాత్రమే ఎదుర్కొన్న దుబే.. 3 సిక్స్‌లతో 25 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే అప్పటివరకు స్లోగా సాగిన సీఎస్‌కే ఇన్నింగ్స్.. దుబే సూపర్ బ్యాటింగ్‌తో ఊపందుకుంది. అనంతరం జడేజా, ధోని బ్యాట్‌కు పనిచెప్పడం సీఎస్‌కే 167 పరుగుల స్కోర్ సాధించగల్గింది.
ఇప్పటి వరకు ఈ ఏడాది సీజన్‌లో 12 మ్యాచ్‌లు ఆడిన దుబే.. 159.9 స్ట్రైక్ రేట్‌తో 315 పరుగులు చేశాడు. ఈ ఏడాది సీజన్‌లో ఇప్పటి వరకు దుబే 11 ఫోర్లు, 27 సిక్సర్లు బాదాడు. ఇక సీఎస్‌కే విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న దుబేపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
Six Video
On the menu tonight - Dube delight🔥#CSKvDC #IPLonJioCinema #TATAIPL #IPL2023 #Yellove | @ChennaiIPL @IamShivamDube pic.twitter.com/INpghtzeP1
— JioCinema (@JioCinema) May 10, 2023
జట్టుకు పట్టిన దరిద్రం అన్నారు.. ఇప్పడు ఏమో బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు" అని ఓ యూజర్ ట్వీట్ చేశాడు. ఇక శివమ్ దుబే కొట్టిన సిక్సర్లే మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్ అని సీఎస్‌కే స్టార్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ కూడా తెలిపాడు.
(The above story first appeared on LatestLY on May 11, 2023 06:33 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

