Latest ICC Rankings: టీ20 బ్యాట్స్‌మెన్‌లలో నెంబర్‌వన్‌‌గా సూర్యకుమార్‌ యాదవ్‌, టాప్ ఆల్‌ రౌండర్‌గా స్టోయినిస్‌, ఐసీసీ తాజాగా టీ20 ర్యాకింగ్స్‌ ఇవిగో..

ఐసీసీ తాజాగా టీ20 ర్యాకింగ్స్‌ను బుధవారం విడుదల చేసింది. ఆస్ట్రేలియాకు చెందిన స్టోయినిస్‌ నెంబర్‌ వన్‌ ఆల్‌ రౌండర్‌గా నిలిచాడు.శ్రీలంక కెప్టెన్‌ వనిందు హసరంగ రెండో స్థానంలో, బంగ్లాదేశ్ వెటరన్ షకీబ్ అల్ హసన్ మూడో స్థానంలో ఉన్నారు. ఆఫ్ఘన్‌ ఆటగాడు మహ్మద్‌ నబీ టాప్ నుంచి మూడు స్థానాలు కోల్పోయి నాలుగో స్థానంలో నిలిచాడు

Latest ICC Rankings: టీ20 బ్యాట్స్‌మెన్‌లలో నెంబర్‌వన్‌‌గా సూర్యకుమార్‌ యాదవ్‌, టాప్ ఆల్‌ రౌండర్‌గా స్టోయినిస్‌, ఐసీసీ తాజాగా టీ20 ర్యాకింగ్స్‌ ఇవిగో..
Suryakumar Yadav Century (PIC@ IPL twitter)

ఐసీసీ తాజాగా టీ20 ర్యాకింగ్స్‌ను బుధవారం విడుదల చేసింది. ఆస్ట్రేలియాకు చెందిన స్టోయినిస్‌ నెంబర్‌ వన్‌ ఆల్‌ రౌండర్‌గా నిలిచాడు.శ్రీలంక కెప్టెన్‌ వనిందు హసరంగ రెండో స్థానంలో, బంగ్లాదేశ్ వెటరన్ షకీబ్ అల్ హసన్ మూడో స్థానంలో ఉన్నారు. ఆఫ్ఘన్‌ ఆటగాడు మహ్మద్‌ నబీ టాప్ నుంచి మూడు స్థానాలు కోల్పోయి నాలుగో స్థానంలో నిలిచాడు. జింబాబ్వే ఆల్‌ రౌండర్‌ సికందర్ రజా ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు.టీమిండియా ఆల్‌ రౌండర్‌ హర్దిక్‌ పాండ్యా ఏడో స్థానంలో కొనసాగుతున్నాడు.

టీ20 బౌలర్స్‌ ర్యాంకింగ్‌ ఇంగ్లండ్‌కు చెందిన ఆదిల్‌ రషీద్‌ అగ్రస్థానంలో కొనసాగుతుండగా, వెస్టిండిస్‌ లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ అఖిల్‌ హుస్సేన్‌ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు శ్రీలంకకు చెందిన వనిందు హసరంగ మూడో స్థానంలో ఉండగా.. ఆఫ్ఘన్‌ బౌలర్‌ రషీద్‌ ఖాన్‌ నాలుగో స్థానంలో ఉన్నారు. దక్షిణాఫ్రికా బౌలర్‌ అన్రిచ్ నోర్టేజే ఐదోస్థానం, ఆఫ్ఘన్‌ బౌలర్‌ ఫజల్హాక్ ఫారూఖీ ఆరోస్థానంలో కొనసాగుతున్నాడు. భారత స్పిన్నర్‌ అక్షర్‌ పటేల్‌ తొమ్మిదో స్థానంలో కొనసాగుతున్నాడు.  హ్యాట్రిక్ విజయాలతో అదరగొట్టిన వెస్టిండీస్‌, 13 పరుగుల తేడాతో కివీస్ చిత్తు, గ్రాండ్‌గా సూపర్ 8లోకి అడుగుపెట్టిన విండీస్ జట్టు

టీ20 బ్యాట్స్‌మెన్‌లలో సూర్యకుమార్‌ యాదవ్‌ నెంబర్‌వన్‌ స్థానంలో ఉండగా.. ఫిల్ సాల్ట్, బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్ రెండు, మూడు, నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నారు. ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ ఐదో ర్యాంక్‌కు చేరుకోగా, వెస్టిండీస్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ నికోలస్ పూరన్ 11వ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు.

(The above story first appeared on LatestLY on Jun 19, 2024 09:54 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).