టీ20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్ అదరగొట్టింది. ఈ టోర్నీకి ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న ఆ జట్టు హ్యాట్రిక్ విజయాలతో సూపర్- 8లో చోటు దక్కించుకుంది. ట్రినిడాడ్ లోని బ్రియాన్ లారా స్టేడియం వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కివీస్‌ను 13 పరుగుల తేడాతో విండీస్ ఓడించింది. ట్రెంట్ బౌల్ట్ (3/16), సౌథీ (2/21) కట్టడి చేయడంతో కరేబియన్ టాపార్డర్ విఫలమైనా ఏడో స్థానంలో వచ్చిన షెర్ఫెన్ రూథర్‌ఫర్డ్ (39 బంతుల్లో 68, 2 ఫోర్లు, 6 సిక్సర్లు) వీరవిహారం చేయడంతో ఆ జట్టు 20 ఓవర్లలో 149/9 పరుగులు చేసింది. అనంతరం కివీస్.. నిర్ణీత ఓవర్లలో 136/9 వద్దే ఆగిపోయింది. అల్జారీ జోసెఫ్(4/19), గుడకేశ్ మోటీ (3/25) రాణించారు. వరుసగా రెండు ఓటములతో కివీస్ ప్రపంచకప్ నుంచి ఔట్ అయింది. పోరాడకుండానే ప్రపంచకప్ నుంచి న్యూజీలాండ్ ఔట్, సూపర్ 8 బెర్తులోకి ప్రవేశించిన ఆఫ్ఘనిస్తాన్, ఇప్పటికే వెస్టిండీస్ ఎంట్రీ
వెస్టిండీస్ ఇన్నింగ్స్: కింగ్ (సి) కాన్వే (బి) నీషమ్ 9; ఛార్లెస్ (బి) బౌల్ట్ 0; పూరన్ (సి) కాన్వే (బి) సౌథీ 17; ఛేజ్ (సి) రచిన్ (బి) ఫెర్గూసన్ 0; పావెల్ (సి) కాన్వే (బి) సౌథీ 1; రుథర్‌ఫర్డ్ నాటౌట్ 68; అకీల్ (సి) నీషమ్ (బి) శాంట్నర్ 15; రసెల్ (సి) ఫెర్గూసన్ (బి) బౌల్ట్ 14; షెఫర్డ్ ఎల్బీ (బి) ఫెర్గూసన్ 13; అల్జారి జోసెఫ్ (బి) బౌల్ట్ 6; గుడకేశ్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం: (20 ఓవర్లలో 9 వికెట్లకు) 149; వికెట్ల పతనం: 1-1, 2-20, 3-21, 4-22, 5-30, 6-58, 7-76, 8-103, 9-112; బౌలింగ్: బౌల్ట్ 4-1-16-3; సౌథీ 4-0-21-2; ఫెర్గూసన్ 4-0-27-2; నీషమ్ 4-0-27-1; గ్లెన్ ఫిలిప్స్ 1-0-9-0; శాంట్నర్ 2-0-27-1; డరిల్ మిచెల్ 1-0-19-0
న్యూజిలాండ్ ఇన్నింగ్స్: కాన్వే (సి) ఛేజ్ (బి) అకీల్ 5; అలెన్ (సి) రసెల్ (బి) జోసెఫ్ 26; రచిన్ (సి) రసెల్ (బి) మోటీ 10; విలియమ్సన్ (సి) పూరన్ (బి) మోటీ 1; డరిల్ మిచెల్ (బి) మోటీ 12; ఫిలిప్స్ (సి) పావెల్ (బి) జోసెఫ్ 40; నీషమ్ (సి) కింగ్ (బి) జోసెఫ్ 10; శాంట్నర్ నాటౌట్ 21; సౌథీ (సి) అండ్ (బి) జోసెఫ్ 0; బౌల్ట్ (సి) ఛేజ్ (బి) రసెల్ 7; ఫెర్గూసన్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం: (20 ఓవర్లలో 9 వికెట్లకు) 136; వికెట్ల పతనం: 1-20, 2-34, 3-39, 4-54, 5-63, 6-85, 7-108, 8-108, 9-117; బౌలింగ్: అకీల్ హొసీన్ 4-0-21-1; షెఫర్డ్ 3-0-36-0; రసెల్ 4-0-30-1; అల్జారి జోసెఫ్ 4-0-19-4; గుడకేశ్ మోటీ 4-0-25-3; రోస్టన్ ఛేజ్ 1-0-4-0