IPL 2023: రూ.17.5 కోట్లు నీకెందుకు బ్రో, కామెరాన్ గ్రీన్‌ను దారుణంగా ట్రోల్ చేస్తున్న ముంబై ఇండియన్స్‌ అభిమానులు, దారుణంగా విఫలమవుతున్న ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌

ఐపీఎల్‌-2023 సీజన్‌కు ముందు జరిగిన మినీ వేలంలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ కామెరాన్ గ్రీన్‌ను రూ.17.5 కోట్లకు ముంబై ఇండియన్స్‌ కొనుగోలు చేసింది. అయితే ఇంత భారీ ధర దక్కించుకున్న గ్రీన్‌.. ఈ ఏడాది ఐపీఎల్‌లో మాత్రం దారుణ ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఈ మెగా ఈవెంట్‌లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గ్రీన్‌ దారుణంగా విఫలయ్యాడు.

IPL 2023: రూ.17.5 కోట్లు నీకెందుకు బ్రో, కామెరాన్ గ్రీన్‌ను దారుణంగా ట్రోల్ చేస్తున్న ముంబై ఇండియన్స్‌ అభిమానులు, దారుణంగా విఫలమవుతున్న ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌
Cameron Green (Photo-IPL Twitter)

ఐపీఎల్‌-2023 సీజన్‌కు ముందు జరిగిన మినీ వేలంలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ కామెరాన్ గ్రీన్‌ను రూ.17.5 కోట్లకు ముంబై ఇండియన్స్‌ కొనుగోలు చేసింది. అయితే ఇంత భారీ ధర దక్కించుకున్న గ్రీన్‌.. ఈ ఏడాది ఐపీఎల్‌లో మాత్రం దారుణ ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఈ మెగా ఈవెంట్‌లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గ్రీన్‌ దారుణంగా విఫలయ్యాడు.

బ్యాటింగ్‌, బౌలింగ్‌ రెండు విభాగాల్లోనూ కామోరాన్ గ్రీన్‌ రాణించలేకపోతున్నాడు. ఆర్సీబీతో జరిగిన తొలి మ్యాచ్‌లో కేవలం 5 పరుగులు చేసి ఒక్క వికెట్‌ సాధించిన గ్రీన్‌.. అనంతరం శనివారం సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 12 పరుగులు మాత్రమే చేశాడు.

ఈ ఆటకు రూ. 13 కోట్లు ఎందుకు బ్రో, హ్యరీ బ్రూక్‌ని దారుణంగా ట్రోల్ చేస్తున్న ఎస్‌ఆర్‌హెచ్‌ అభిమానులు, మూడవసారి కూడా విఫలమైన బ్రూక్

బౌలింగ్‌లో అయితే వికెట్‌ ఏమి సాధించకుండా 20 పరుగులిచ్చాడు. ఇక రూ.17.5 కోట్ల భారీ మెత్తం తీసుకుని దారుణంగా విఫలమవుతున్న గ్రీన్‌ను నెటిజన్లు దారుణంగా ట్రోలు చేస్తున్నారు. ఈ మాత్రం ఆటకేనా ఇంత తీసుకున్నావు అంటూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు.

(The above story first appeared on LatestLY on Apr 10, 2023 12:34 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).