Pakistan vs New Zealand

ప్రపంచకప్ 2002 సెమీఫైనల్ మ్యాచ్ ల ో పాకిస్థాన్‌కు 153 ర‌న్స్ టార్గెట్ విసిరింది న్యూజిలాండ్‌. టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ ఫ‌స్ట్ సెమీస్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత ఓవ‌ర్ల‌లో నాలుగు వికెట్ల న‌ష్టానికి 152 ర‌న్స్ చేసింది. డారెల్ మిచ‌ల్ టీ20ల్లో మూడ‌వ హాఫ్ సెంచ‌రీ న‌మోదు చేశాడు.

32 బంతుల్లో మూడు ఫోర్లు, ఓ సిక్స‌ర్‌తో 50 ర‌న్స్ చేశాడత‌ను. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ కేన్ విలియ‌మ్‌స‌న్ కీల‌క ఇన్నింగ్స్ ఆడాడు. పాక్ క‌ట్టుదిట్టంగా బౌలింగ్ వేస్తున్నా.. అత‌ను సింగిల్స్ తీస్తూ ఆచితూచి ఆడాడు. నాలుగో వికెట్‌కు మిచెల్‌, విలియ‌మ్‌స‌న్ 68 ర‌న్స్ జోడించారు.

సూర్యకుమార్ యాదవ్ నా బౌలింగ్‌ను ఐచకోత కోశాడు, సంచలన వ్యాఖ్యలు చేసిన ఇంగ్లండ్ వైస్ కెప్టెన్ మొయిన్‌ అలీ, రేపు ఇంగ్లండ్‌తో టీమిండియా సెమీఫైనల్ పోరు

నిజానికి ఈ మ్యాచ్‌లో పాక్ బౌల‌ర్లు ఉత్త‌మ బౌలింగ్ ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చారు. ఫీల్డింగ్‌లోనూ పాక్ ఆట‌గాళ్లు మెరుగ్గా రాణించారు. కివీస్ బ్యాట‌ర్ల‌లో మిచెల్ 53(నాటౌట్‌), విలియ‌మ్‌స‌న్ 46, కాన్వే 21, నీష‌మ్ 16(నాటౌట్‌) ర‌న్స్ చేశారు.