Pakistan vs Bangladesh: బంగ్లాదేశ్ చేతిలో పాకిస్తాన్‌కు ఘోర పరాభవం, టెస్టు సిరీస్‌ క్లీన్ స్వీప్ చేసిన బంగ్లా, దాయాది దేశంపై టెస్టు సిరీస్‌ గెలవడం ఇదే మొదటిసారి

టెస్టు క్రికెట్‌లో బంగ్లాదేశ్‌ చరిత్ర సృష్టించింది. పాకిస్థాన్‌తో జ‌రిగిన టెస్టు సిరీస్‌లో క్లీన్ స్వీప్ చేసింది. రెండో టెస్టులో ఆరు వికెట్ల తేడాతో బంగ్లా విజ‌యం నమోదు చేసింది. అయిదో రోజు టీ బ్రేక్‌కు ముందే.. బంగ్లా మ్యాచ్‌ను ముగించేసింది. స్వంత గ‌డ్డ‌పై దాయాది దేశానికి ఘోర ప‌రాభ‌వం ఎదురైంది.పాక్‌పై బంగ్లాదేశ్‌ టెస్టు సిరీస్‌ గెలవడం ఇదే మొదటిసారి.

Pakistan vs Bangladesh: బంగ్లాదేశ్ చేతిలో పాకిస్తాన్‌కు ఘోర పరాభవం, టెస్టు సిరీస్‌ క్లీన్ స్వీప్ చేసిన బంగ్లా, దాయాది దేశంపై టెస్టు సిరీస్‌ గెలవడం ఇదే మొదటిసారి
Bangladesh players wicket celebration against Pakistan (Photo Credit: X/@TheRealPCB)

టెస్టు క్రికెట్‌లో బంగ్లాదేశ్‌ చరిత్ర సృష్టించింది. పాకిస్థాన్‌తో జ‌రిగిన టెస్టు సిరీస్‌లో క్లీన్ స్వీప్ చేసింది. రెండో టెస్టులో ఆరు వికెట్ల తేడాతో బంగ్లా విజ‌యం నమోదు చేసింది. అయిదో రోజు టీ బ్రేక్‌కు ముందే.. బంగ్లా మ్యాచ్‌ను ముగించేసింది. స్వంత గ‌డ్డ‌పై దాయాది దేశానికి ఘోర ప‌రాభ‌వం ఎదురైంది.పాక్‌పై బంగ్లాదేశ్‌ టెస్టు సిరీస్‌ గెలవడం ఇదే మొదటిసారి.

రావల్పిండి వేదికగా జరిగిన రెండో టెస్టులో 185 పరుగుల లక్ష్యఛేదనలో ఓవర్‌ నైట్ స్కోరు 42/0తో (రెండో ఇన్నింగ్స్‌) మంగళవారం, ఐదో రోజు ఆటను ప్రారంభించిన ఆ జట్టు 56 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ని అందుకుంది. ఓపెనర్లు జకీర్‌ హసన్‌ (40), షాద్మాన్‌ ఇస్లామ్ (24), నజ్ముల్ హొస్సేన్ శాంటో (38), మోమినుల్ హక్ (34), ముష్పీకర్‌ రహీమ్ (22*), షకీబ్‌ అల్ హసన్ (21*) రాణించారు. పాక్‌ బౌలర్లలో మీర్ హంజా, షాజాద్, అబ్రార్ అహ్మద్, ఆఘా సల్మాన్‌ తలో వికెట్ పడగొట్టారు.

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025 ఫైనల్ తేదీ వచ్చేసింది, తొలిసారి వేదిక కానున్న లార్డ్స్ మైదానం, పూర్తి వివరాలు ఇవే..

తొలి ఇన్నింగ్స్‌లో పాకిస్థాన్‌ 274 పరుగులకు ఆలౌటైంది. బంగ్లాదేశ్ ఫస్ట్‌ ఇన్నింగ్స్‌లో 26 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో లిటన్ దాస్ (138), మెహదీ హసన్‌ మిరాజ్ (78) ఆదుకోవడంతో 262 రన్స్‌కు ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లా పేసర్లు హసన్‌ మహ్మద్‌ (5/43), నహీద్‌ రాణా (4/44) విజృంభించడంతో రెండో ఇన్నింగ్స్‌లో పాక్‌ 172కే కుప్పకూలింది. సల్మాన్‌ ఆఘా (47 నాటౌట్‌), మహ్మద్‌ రిజ్వాన్‌ (43) పోరాడకపోతే పాక్‌ ఆ మాత్రం స్కోరు కూడా చేసేది కాదు.ఇప్ప‌టి వ‌ర‌కు బంగ్లాదేశ్ విదేశాల్లో రెండు టెస్టు సిరీస్‌ల‌ను గెలుచుకున్న‌ది. 2009లో వెస్టిండీస్‌తో, 2021లో జింబాబ్వేతో జ‌రిగిన సిరీస్‌ల్లో విజ‌యం సాధించింది.

(The above story first appeared on LatestLY on Sep 03, 2024 09:14 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).