Rishabh Pant: ఆసియాలో తొలి క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పిన రిషబ్ పంత్, ఇంగ్లండ్ లో టెస్టులతో పాటు వన్డే ఫార్మాట్‌లో కూడా సెంచరీ చేసిన తొలి వికెట్ కీపర్ బ్యాటర్‌గా గుర్తింపు
టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ అరుదైన ఘనత సాధించాడు. ఇంగ్లండ్ తో ఆదివారం ముగిసిన నిర్ణయాత్మక మూడో వన్డేలో సెంచరీ చేయడం ద్వారా.. ఇంగ్లండ్ లో టెస్టులతో పాటు వన్డే ఫార్మాట్ లో కూడా సెంచరీ చేసిన తొలి ఆసియా వికెట్ కీపర్ బ్యాటర్ గా అరుదైన గుర్తింపు దక్కించుకున్నాడు.
- Read in
- తెలుగు
టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ అరుదైన ఘనత సాధించాడు. ఇంగ్లండ్ తో ఆదివారం ముగిసిన నిర్ణయాత్మక మూడో వన్డేలో సెంచరీ చేయడం ద్వారా.. ఇంగ్లండ్ లో టెస్టులతో పాటు వన్డే ఫార్మాట్ లో కూడా సెంచరీ చేసిన తొలి ఆసియా వికెట్ కీపర్ బ్యాటర్ గా అరుదైన గుర్తింపు దక్కించుకున్నాడు.ఇంగ్లండ్ తో కొద్దిరోజుల క్రితమే ముగిసిన రీషెడ్యూల్డ్ టెస్టులో పంత్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే.
ఇంగ్లండ్ పై టెస్టులతో పాటు వన్డేలలో కూడా సెంచరీలు చేసిన జాబితాలో గతంలో శ్రీలంక వికెట్ కీపర్ కుమార సంగక్కర కూడా ఉన్నాడు. సంగక్కర టెస్టులలో ఇంగ్లండ్ పై రెండు సెంచరీలు, రెండు వన్డే శతకాలు బాదాడు. కానీ టెస్టులలో అతడు సెంచరీలు చేసినప్పుడు ప్రసన్న జయవర్దెనే వికెట్ కీపర్ గా బాధ్యతలు నిర్వర్తించాడు. దీంతో టెస్టులలో అతడు చేసిన సెంచరీలు కేవలం ఆటగాడిగా చేసినట్టుగానే నమోదయ్యాయి.
Rishabh Pant becomes first Asian wicketkeeper-batter to score Test, ODI centuries in England
Read @ANI Story | https://t.co/KLc8m2vnBz #RishabhPant #INDvsENG #cricket #TeamIndia pic.twitter.com/CqO99nbeTw
— ANI Digital (@ani_digital) July 18, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jul 18, 2022 06:07 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

