RCB vs KKR: వ‌రుస‌గా రెండో మ్యాచ్ లోనూ కోల్ క‌తా గ్రాండ్ విక్ట‌రీ, ఆర్సీబీపై 7 వికెట్ల తేడాతో విజ‌యం, వృధాగా మారిన కోహ్లీ వ‌న్ మ్యాన్ షో

ఐపీఎల్‌ 2024లో భాగంగా కోల్‌కతా వరుసగా (RCB vs KKR) రెండో విజయం సాధించింది. బెంగళూరుతో జరిగిన పోరులో ఆ జట్టు 7 వికెట్ల తేడాతో నెగ్గింది. 183 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా 16.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. వెంకటేశ్‌ అయ్యర్‌ (50) అర్ధశతకం చేయగా, సునీల్‌ నరైన్‌ (47), ఫిలప్‌ సాల్ట్‌(30), శ్రేయస్‌ అయ్యర్‌(39*) (Shreyas Iyer) రాణించారు.

RCB vs KKR: వ‌రుస‌గా రెండో మ్యాచ్ లోనూ కోల్ క‌తా గ్రాండ్ విక్ట‌రీ, ఆర్సీబీపై 7 వికెట్ల తేడాతో విజ‌యం, వృధాగా మారిన కోహ్లీ వ‌న్ మ్యాన్ షో
RCB-vs-KKR (Photo Credits: Twitter)

Bangalore, March 29: ఐపీఎల్‌ 2024లో భాగంగా కోల్‌కతా వరుసగా (RCB vs KKR) రెండో విజయం సాధించింది. బెంగళూరుతో జరిగిన పోరులో ఆ జట్టు 7 వికెట్ల తేడాతో నెగ్గింది. 183 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా 16.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. వెంకటేశ్‌ అయ్యర్‌ (50) అర్ధశతకం చేయగా, సునీల్‌ నరైన్‌ (47), ఫిలప్‌ సాల్ట్‌(30), శ్రేయస్‌ అయ్యర్‌(39*) (Shreyas Iyer) రాణించారు. బెంగళూరు బౌలర్లలో యశ్‌ దయాల్‌, మయాంక్‌ దాగర్‌, విజయ్‌కుమార్‌ తలో వికెట్‌ తీశారు. అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది.

 

ఓపెనర్‌ విరాట్‌ కోహ్లీ (83: 59 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) నాటౌట్‌గా నిలిచి బెంగళూరు భారీ స్కోర్‌ చేయడంతో కీలకంగా వ్యవహరించాడు. గ్రీన్‌ (33), మాక్స్‌వెల్‌ (28), దినేశ్‌ కార్తిక్‌ (20) విరాట్‌కు సహకరించారు. కోల్‌కతా బౌలర్లలో రాణా, రస్సెల్‌ తలో రెండు వికెట్లు తీశారు.

(The above story first appeared on LatestLY on Mar 29, 2024 11:05 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).