T20 World Cup 2022: ప్రపంచ కప్ నుంచి దక్షిణాఫ్రికా ఔట్, పసికూన నెదర్లాండ్స్ చేతిలో చిత్తయిన సఫారీలు, 13 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన నెదర్లాండ్స్
టీ20 వరల్డ్‌కప్ హాట్ ఫేవరెట్లలో ఒకటైన దక్షిణాఫ్రికాకు ఘోర పరాభవం ఎదురైంది. ఇవాళ (నవంబర్ 6) జరిగిన మ్యాచ్‌లో ప్రొటీస్ జట్టు పసికూన నెదర్లాండ్స్ చేతిలో చిత్తుగా ఓడి ఏకంగా టోర్నీ నుంచే నిష్క్రమించింది.
టీ20 వరల్డ్‌కప్ హాట్ ఫేవరెట్లలో ఒకటైన దక్షిణాఫ్రికాకు ఘోర పరాభవం ఎదురైంది. ఇవాళ (నవంబర్ 6) జరిగిన మ్యాచ్‌లో ప్రొటీస్ జట్టు పసికూన నెదర్లాండ్స్ చేతిలో చిత్తుగా ఓడి ఏకంగా టోర్నీ నుంచే నిష్క్రమించింది. ఫలితంగా టీమిండియా జింబాబ్వే మ్యాచ్‌తో సంబంధం లేకుంగా సెమీస్‌కు చేరుకుంది. ఈ గ్రూప్ నుంచి రెండో సెమీస్ బెర్త్.. ఇదే వేదికపై తదుపరి జరిగే బంగ్లాదేశ్-పాకిస్తాన్ మ్యాచ్ ఫలితంపై ఆధారపడి ఉంటుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు గ్రూప్-2 నుంచి రెండో జట్టుగా సెమీస్‌కు అర్హత సాధిస్తుంది.
నెదర్లాండ్స్‌తో జరిగిన అత్యంత కీలకమైన దక్షిణాఫ్రికా టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. స్టెఫాన్ మైబుర్గ్ (37), మ్యాక్స్ ఓడౌడ్ (29), టామ్ కూపర్ (35), కొలిన్ ఆకెర్‌మన్ (41 నాటౌట్) ఓ మోస్తరుగా రాణించడంతో నెదర్లాండ్స్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. సఫారీ బౌలర్లలో కేశవ్ మహారాజ్ 2 వికెట్లు పడగొట్టగా.. అన్రిచ్ నోర్జే, ఎయిడెన్ మార్క్రమ్‌లకు తలో వికెట్ దక్కింది.
పాకిస్తాన్ సెమీస్ ఆశలు సజీవం, దక్షిణాఫ్రికాపై 33 పరుగుల తేడాతో ఘన విజయం
అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా.. నెదర్లాండ్స్ బౌలర్ల ఉచ్చులో చిక్కుకుని ఘోర ఓటమిని మూటగట్టుకుంది. డచ్ బౌలర్లు బ్రాండన్ గ్లోవర్ 3, బాస్ డి లీడ్, ఫ్రెడ్ క్లాస్సెన్ తలో 2 వికెట్లు, పాల్ వాన్ మీకెరెన్ ఓ వికెట్ పడగొట్టడంతో దక్షిణాఫ్రికా.. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 145 పరుగులకే పరిమితమై 13 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. సఫారీ బ్యాటర్లలో రిలీ రొస్సో (25) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
(The above story first appeared on LatestLY on Nov 06, 2022 09:41 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

