Virat Kohli: రూమర్స్ కు చెక్ పెట్టిన విరాట్ కోహ్లీ, ఎట్టకేలకు ముంబై నుంచి అమెరికా ఫ్లైట్ ఎక్కిన స్టార్ బ్యాట్స్ మెన్, వార్మప్ మ్యాచ్ లో ఆడతాడా? లేదా? అన్నది అనుమానమే
ఐపీఎల్ 2024 ముగిసిందో లేదో.. మరో మెగా క్రికెట్ టోర్నీ అభిమానులను అలరించేందుకు సిద్ధమైంది. టీ 20 వరల్డ్ కప్ 2024 (T20 World Cup 2024) రేపటి నుంచి ప్రారంభం కాబోతున్న విషయం తెలిసిందే. జూన్ 1న ఆరంభ వేడుకలతో వరల్డ్ కప్ టోర్నీ షురూ కానుంది. దీంతో ఇప్పటికే అన్ని జట్లు టీ20 సమరానికి సిద్ధమయ్యాయి.
Mumbai, May 31: ఐపీఎల్ 2024 ముగిసిందో లేదో.. మరో మెగా క్రికెట్ టోర్నీ అభిమానులను అలరించేందుకు సిద్ధమైంది. టీ 20 వరల్డ్ కప్ 2024 (T20 World Cup 2024) రేపటి నుంచి ప్రారంభం కాబోతున్న విషయం తెలిసిందే. జూన్ 1న ఆరంభ వేడుకలతో వరల్డ్ కప్ టోర్నీ షురూ కానుంది. దీంతో ఇప్పటికే అన్ని జట్లు టీ20 సమరానికి సిద్ధమయ్యాయి. ఇక టీమ్ ఇండియా గత వారమే అమెరికా చేరుకుంది. హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్‌తోపాటు కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma), రిషభ్ పంత్, శివం దూబే, కుల్దీప్ యాదవ్, సిరాజ్‌లు న్యూయార్క్ చేరుకున్నారు.
Virat Kohli giving autograph to fans at the airport. 👏
Nice Gesture by King Kohli 👑❤️ pic.twitter.com/FPRvP0FaBv
— Virat Kohli Fan Club (@Trend_VKohli) May 30, 2024
అయితే స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) మాత్రం వెళ్లలేదు. దీంతో అతడు జూన్ 1 న బంగ్లాదేశ్‌తో జరగనున్న వామప్ మ్యాచ్‌కు (warm-up game) దూరం కానున్నాడంటూ వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా టీ20 కోసం విరాట్ (Kohli) అమెరికా ఫ్లైట్ ఎక్కేశాడు. గురువారం సాయంత్రం ముంబై ఎయిర్‌పోర్ట్ (Mumbai Airport)లో కోహ్లీ దర్శనమిచ్చాడు. కోహ్లీని చూసిన అభిమానులు అతడిని చుట్టుముట్టి ఫొటోలు, ఆటోగ్రాఫ్‌ల కోసం ఎగబడ్డారు. కోహ్లీ ఎయిర్‌పోర్ట్‌లో ఉన్న ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. అయితే, జూన్1 న జరిగే వామప్ మ్యాచ్‌లో కోహ్లీ ఆడతాడో లేదో అన్నదానిపై క్లారిటీ లేదు.
(The above story first appeared on LatestLY on May 31, 2024 11:53 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

