Virat Kohli: రోజర్‌ ఫెదరర్‌‌పై ఉద్వేగపూరిత వీడియో, నీలాంటి గొప్ప అథ్లెట్‌ను నేనింతవరకు చూడలేదు అంటూ ఎమోషనల్ అయిన టీమిండియా మాజీ కెప్టెన్

కోహ్లి.. ఫెదరర్‌ను ఉద్దేశించి మాట్లాడిన వీడియోను ఏటీపీ టూర్‌ ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేసింది.ఇందులో.. ‘‘హల్లో రోజర్‌.. మాకు ఎన్నెన్నో మధురానుభూతులు, జ్ఞాపకాలు మిగిల్చిన నీకు ఇలా వీడియో ద్వారా విషెస్‌ చెప్పడం నిజంగా నాకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నా. నాకు తెలిసి ఒకే ఒక్కసారి నిన్ను నేను నేరుగా కలిశాను.

Virat Kohli: రోజర్‌ ఫెదరర్‌‌పై ఉద్వేగపూరిత వీడియో, నీలాంటి గొప్ప అథ్లెట్‌ను నేనింతవరకు చూడలేదు అంటూ ఎమోషనల్ అయిన టీమిండియా మాజీ కెప్టెన్
Virat Kohli Roger Federer (Photo-Video Grab)

స్విట్జర్లాండ్‌ టెన్నిస్‌ స్టార్‌ రోజర్‌ ఫెదరర్‌ ఇటీవలే రిటైర్మెంట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. లండన్‌ వేదికగా లేవర్‌ కప్‌-2022లో వ్యక్తిగతంగా చిరకాల మిత్రుడు, ఆటలో చిరకాల ప్రత్యర్థి అయిన స్పెయిన్‌ బుల్‌ రఫేల్‌ నాదల్‌తో కలిసి ఆఖరి మ్యాచ్‌ ఆడాడు.టీమ్‌ యూరోప్‌ తరఫున బరిలోకి దిగిన ఈ దిగ్గజ జంట టీమ్‌ వరల్డ్‌కు చెందిన జాక్‌ సాక్‌, ఫ్రాన్సిస్‌ టియాఫో చేతిలో ఓడిపోయింది. ఇక ఓటమితో కెరీర్‌కు వీడ్కోలు పలికిన ఫెడెక్స్‌ కోర్టులోనే తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. రఫా సైతం కన్నీటి పర్యంతమయ్యాడు.

వైరల్ వీడియో, అనుష్కతో వీడియో కాల్‌లో ఉన్నా, నన్ను డిస్ట్రబ్ చేయకండి, అభిమానులకు వీడియో కాల్‌ చూపించిన కోహ్లీ, వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌

వీరిద్దరు కలిసి ఉన్న ఫొటో వైరల్‌ కాగా.. విరాట్‌ కోహ్లి ఆ ఫొటోను షేర్‌ చేస్తూ ఉద్వేగపూరిత ట్వీట్‌ చేసిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా.. కోహ్లి.. ఫెదరర్‌ను ఉద్దేశించి మాట్లాడిన వీడియోను ఏటీపీ టూర్‌ ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేసింది.ఇందులో.. ‘‘హల్లో రోజర్‌.. మాకు ఎన్నెన్నో మధురానుభూతులు, జ్ఞాపకాలు మిగిల్చిన నీకు ఇలా వీడియో ద్వారా విషెస్‌ చెప్పడం నిజంగా నాకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నా. నాకు తెలిసి ఒకే ఒక్కసారి నిన్ను నేను నేరుగా కలిశాను.

Here's Video

2018 ఆస్ట్రేలియా ఓపెన్‌ సందర్భంగా నీతో మాట్లాడాను. నా జీవితంలో నేను మర్చిపోలేని మధుర జ్ఞాప​కం అది. నీలాంటి గొప్ప అథ్లెట్‌ను నేనింతవరకు చూడలేదు. నువ్వు సంపాదించుకున్న ఈ కీర్తిప్రతిష్టలు మరెవరికీ సాధ్యం కాకపోవచ్చు. నీ భవిష్యత్తు మరింత అందంగా ఉండాలి. నీకు.. నీ కుటుంబానికి ఆల్‌ ది బెస్ట్‌. టేక్‌ కేర్‌’’ అంటూ కోహ్లి ఉద్వేగపూరితంగా మాట్లాడాడు.

(The above story first appeared on LatestLY on Sep 29, 2022 06:29 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).