సౌతాఫ్రికాతో జరిగిన తొలి టి20లో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి విదితమే. ఈ మ్యాచ్‌ విజయం అనంతరం రాత్రి తిరువనంతపురం నుంచి ఎయిర్‌పోర్ట్‌ వరకు టీమిండియా బృందం బస్సులో బయలుదేరింది. కోహ్లిని చూడగానే అభిమానుల్లో మరింత జోష్‌ వచ్చింది. కోహ్లి.. కోహ్లి'' అంటూ గట్టి గట్టిగా అరిచారు. అయితే ఆ సమయంలో కోహ్లి.. తన భార్య అనుష్క శర్మతో ఫోన్‌లో వీడియో కాల్‌లో ఉన్నాడు. అభిమానుల పిలుపుకు స్పందించిన కోహ్లి వెంటనే బస్సు అద్దంలో నుంచి.. ''అనుష్కతో వీడియో కాల్‌లో ఉన్నా.. డిస్టర్బ్‌ చేయకండి'' అంటూ ఫోన్‌ చూపిస్తూ నవ్వాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)