Rahul Tewatia: నీవు చాలా అందంగా ఉన్నావు..నన్ను పెళ్లి చేసుకుంటావా, నీళ్ళ బాటిల్‌కి ప్రపోజ్ చేసిన ఆర్‌ఆర్ ప్లేయర్ రాహుల్‌ తెవాటియా, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఐ లవ్‌ యూ.. నన్ను పెళ్లి చేసుకుంటావా? (You are so beautiful. I love you. Will you marry me) అయినా ఎందుకు చేసుకోవులే’’ అంటూ సిగ్గుపడుతూ రాహుల్ ప్రపోజల్‌ పూర్తి చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Rahul Tewatia: నీవు చాలా అందంగా ఉన్నావు..నన్ను పెళ్లి చేసుకుంటావా, నీళ్ళ బాటిల్‌కి ప్రపోజ్ చేసిన ఆర్‌ఆర్ ప్లేయర్ రాహుల్‌ తెవాటియా, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
Rahul Tewatia Love Propose (Photo-RR Twitter)

కరోనా సెకండ్ వేవ్ కల్లోలం రేపుతున్న నేపథ్యంలో ఐపీఎల్‌-2021 వాయిదా పడిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో క్రికెట్ అభిమానులు చాలా బోర్ గా ఫీలవుతున్నారు. అయితే వారిని ఎంటర్ టైన్ చేయడానికి పలు ఫ్రాంఛైజీలు సరికొత్తగా ముందుకు వచ్చాయి. పలు ఫ్రాంఛైజీలు సోషల్‌ మీడియా వేదికగా తమ ఆటగాళ్ల వీడియోలు పోస్ట్‌ చేస్తూ ఆనందం పంచుతున్నాయి ఈ సీజన్‌లో నమోదైన అత్యుత్తమ ప్రదర్శనకు సంబంధించిన దృశ్యాలతో పాటుగా, క్రికెటర్ల వ్యక్తిగత ఫన్నీ మూమెంట్స్‌ షేర్‌ చేస్తూ వినోదం అందిస్తున్నాయి.

తాజాగా రాజస్తాన్‌ రాయల్స్‌ ఇలాంటి ఓ వీడియోను తన అభిమానులతో పంచుకుంది. బయో బబుల్‌లో ఉన్న తమ ఆటగాళ్లతో ఆర్‌ఆర్‌ ఓ గేమ్‌ ఆడించింది. ఇందులో భాగంగా మ్యూజిక్‌ ఆగిపోయినపుడు పార్శిల్‌ ఎవరి చేతిలో ఉంటుందో వాళ్లు, ఓ చిట్టీ తెరచి అందులో ఏముంటే అది చేయాలి.ఈ క్రమంలో రాహుల్‌ తెవాటియా (Rajasthan Royals player Rahul Tewatia) చేతిలోకి పార్శిల్‌ రాగానే మ్యూజిక్‌ ఆగిపోవడంతో అతడు టాస్క్‌ చేయాల్సి వచ్చింది.

You can watch the video below

నీళ్ల బాటిల్‌కు ప్రపోజ్‌ చేయాలని (proposing to a water bottle) చిట్టీలో ఉండటంతో.. మెల్లగా బాటిల్‌ తీసుకున్న అతడు.. ముసిముసిగా నవ్వుతూ తొలుత సీనియర్ల సలహాలు అడిగాడు. ఆ తర్వాత తానే రంగంలోకి దిగి.. ‘‘నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఐ లవ్‌ యూ.. నన్ను పెళ్లి చేసుకుంటావా? (You are so beautiful. I love you. Will you marry me) అయినా ఎందుకు చేసుకోవులే’’ అంటూ సిగ్గుపడుతూ ప్రపోజల్‌ పూర్తి చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

(The above story first appeared on LatestLY on May 12, 2021 02:12 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).