World Cup 2023: ఆస్ట్రేలియాకు ఘోర పరాభవం, 134 పరుగుల తేడాతో చిత్తుచిత్తుగా ఓడించిన దక్షిణాఫ్రికా, వరుసగా రెండో ఓటమితో కంగారులు విలవిల

వన్డే ప్రపంచకప్‌-2023లో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఘన విజయం సాధించింది. సఫారీలు విసిరిన భారీ లక్ష్యాన్ని చేధించలేక కంగారులు చతికిలపడ్డారు. లక్నోలోని అటల్‌ బిహారీ వాజ్‌పేయి స్టేడియంలో కంగారూ- ప్రొటిస్‌ జట్లు తలపడగా సఫారీలు మాసివ్ విక్టరీ నమోదు చేశారు. తద్వారా పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకున్నారు.

World Cup 2023: ఆస్ట్రేలియాకు ఘోర పరాభవం, 134 పరుగుల తేడాతో చిత్తుచిత్తుగా ఓడించిన దక్షిణాఫ్రికా, వరుసగా రెండో ఓటమితో కంగారులు విలవిల
South Africa (photo-X)

వన్డే ప్రపంచకప్‌-2023లో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఘన విజయం సాధించింది. సఫారీలు విసిరిన భారీ లక్ష్యాన్ని చేధించలేక కంగారులు చతికిలపడ్డారు. లక్నోలోని అటల్‌ బిహారీ వాజ్‌పేయి స్టేడియంలో కంగారూ- ప్రొటిస్‌ జట్లు తలపడగా సఫారీలు మాసివ్ విక్టరీ నమోదు చేశారు. తద్వారా పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకున్నారు.

టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. సౌతాఫ్రికా ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌ వరుసగా రెండో శతకం(109)తో మెరవగా..గత మ్యాచ్‌లో విఫలమైన కెప్టెన్‌ తెంబా బవుమా(35) ఈసారి ఫర్వాలేదనిపించాడు.వన్‌డౌన్‌ బ్యాటర్‌ రాసీ వాన్‌ డెర్‌ డసెన్‌ 26 పరుగులతో రాణించగా.. ఆ తర్వాతి స్థానాల్లో బ్యాటింగ్‌ చేసిన ఎయిడెన్‌ మార్కరమ్‌(56), హెన్రిచ్‌ క్లాసెన్‌ 29 పరుగులు రాబట్టారు. మార్కో జాన్సెన్‌ 26 పరుగులు సాధించాడు.

ఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్లలో ప్రొటిస్‌ జట్టు 7 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. ఆసీస్‌ బౌలర్లలో పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌, ఆఫ్‌ బ్రేక్‌ స్పిన్నర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌ రెండేసి వికెట్లు తీయగా.. కెప్టెన్‌, స్పీడ్‌స్టర్లు ప్యాట్‌ కమిన్స్‌, జోష్‌ హాజిల్‌వుడ్‌, స్పిన్నర్‌ ఆడం జంపా ఒక్కో వికెట్‌ దక్కించుకున్నారు.

ఆస్ట్రేలియా అంటే పూనకాలే, ప్రపంచకప్‌లో చరిత్ర సృష్టించిన క్వింటన్‌ డికాక్‌, పలు రికార్డులు బద్దలు కొట్టిన సౌతాఫ్రికా ఓపెనర్‌

312 పరులు విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఏ దశలోనే పోటీ ఇవ్వలేదు. 17 ఓవర్లలో 70 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది.పేసర్‌ కగిసో రబడ ఆకాశమే హద్దుగా చెలరేగడంతో 71 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన కంగారూ జట్టు కష్టాల్లో కూరుకుపోయింది.ఆరో ఓవర్‌ ఐదో బంతికి మిచెల్‌ మార్ష్‌(7)ను మార్కో జాన్సెన్‌ అవుట్‌ చేయడంతో మొదలైంది ఆసీస్‌ వికెట్ల పతనం. ఆ తర్వాత ఎంగిడి బౌలింగ్‌లో డేవిడ్‌ వార్నర్‌(13), రబడ బౌలింగ్‌లో స్మిత్‌(19) ఎల్బీడబ్ల్యూ, జోష్‌ ఇంగ్లిస్‌ను బౌల్డ్‌ కాగా.. మహరాజ్‌ బౌలింగ్‌లో మాక్స్‌వెల్‌(3) క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు.

ఆ తర్వాత మళ్లీ రంగంలోకి దిగిన రబడ స్టొయినిస్‌(5)ను అవుట్‌ చేయడంతో ఆసీస్‌ కష్టాల్లో కూరుకుపోయింది. ఇలాంటి దశలో మార్నస్‌ లబుషేన్‌కు తోడుగా టెయిలెండర్‌ మిచెల్‌ స్టార్క్‌(51 బంతుల్లో 27 పరుగులు) పట్టుదలగా క్రీజులో నిలబడిన వేళ మార్కో జాన్సెన్‌ దెబ్బకొట్టాడు. ఆ వెంటనే 46 పరుగులతో నిలకడగా ఆడుతున్న లబుషేన్‌ను కేశవ్‌ మహరాజ్‌ పెవిలియన్‌కు పంపాడు.

ఆఫ్ఘనిస్థాన్ మ్యాచులో బౌండరీ లైను వద్ద శార్దూల్ ఠాకూర్ పట్టిన క్యాచ్ చూస్తే ఊపిరి ఆగిపోవడం ఖాయం..

ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌.. నాలుగు బౌండరీల సాయంతో 22 పరుగులతో నిలదొక్కుకునే ప్రయత్నం చేశాడు. అయితే, 41వ ఓవర్‌ మూడో బంతికి తబ్రేజ్‌ షంసీ బౌలింగ్‌లో కమిన్స్‌ ఇచ్చిన క్యాచ్‌ను మిల్లర్‌ ఎలాంటి పొరపాటు చేయకుండా ఒడిసిపట్టాడు. దీంతో షంసీ ఖాతాలో వరల్డ్‌కప్‌ క్రికెట్‌లో తొలి వికెట్‌ చేరింది.

అదే ఓవర్లో హాజిల్‌వుడ్‌ను కూడా షంసీ అవుట్‌ చేయడంతో ఆసీస్‌ కథ ముగిసిపోయింది. 177 పరుగులకే ఆలౌట్‌ కావడంతో సౌతాఫ్రికా చేతిలో ఏకంగా 134 పరుగులు భారీ తేడాతో ఓడి ఘోర పరాభవం మూటగట్టుకుంది. ప్రొటిస్‌ పేసర్లలో రబడకు మూడు, జాన్సెన్‌కు రెండు, లుంగి ఎంగిడికి ఒక వికెట్‌ దక్కగా.. స్పిన్నర్లు కేశవ్‌ మహారాజ్‌, తబ్రేజ్‌ షంసీ చెరో రెండు వికెట్లు తీశారు.

(The above story first appeared on LatestLY on Oct 12, 2023 09:54 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).