World Cup 2023: విరాట్ కోహ్లీ మరో ఘనత, ప్రపంచ కప్‌లో అత్యుత్తమ ఫీల్డర్లలో నంబర్ వన్‌గా విరాట్ నిలిచాడని తెలిపిన ఐసీసీ
వరల్డ్‌కప్-2023లో మొదటి మూడు మ్యాచ్‌ల తర్వాత టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి అత్యధిక ప్రభావిత ఫీల్డర్‌గా ఐసీసీ చేత రేట్ చేయబడ్డాడు. టోర్నీలో ప్రతి జట్టు మూడు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఐసీసీ ఈ పోటీని నిర్వహించగా.. అందరికంటే కోహ్లికే ఎక్కువ రేటింగ్ పాయింట్లు లభించాయి
వరల్డ్‌కప్-2023లో మొదటి మూడు మ్యాచ్‌ల తర్వాత టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి అత్యధిక ప్రభావిత ఫీల్డర్‌గా ఐసీసీ చేత రేట్ చేయబడ్డాడు. టోర్నీలో ప్రతి జట్టు మూడు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఐసీసీ ఈ పోటీని నిర్వహించగా.. అందరికంటే కోహ్లికే ఎక్కువ రేటింగ్ పాయింట్లు లభించాయి.ఈ విభాగంలో కోహ్లికి పోటీగా జో రూట్, డేవిడ్ వార్నర్ వచ్చినప్పటికీ, అంతిమంగా ఈ ఘనత కోహ్లికే దక్కింది. కోహ్లి 22.30 రేటింగ్ పాయింట్లు దక్కించుకోగా.. రూట్ 21.73, వార్నర్ 21.32 రేటింగ్ పాయింట్లు సాధించారు.
ఇక న్యూజిలాండ్ ఆటగాడు డెవాన్ కాన్వే (15.54), పాకిస్తాన్ షాదాబ్ ఖాన్ (15.13), ఆసీస్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ (15),ఆఫ్ఘనిస్తాన్ రహ్మత్ షా (13.77), న్యూజిలాండ్ మిచెల్ సాంట్నర్ (13.28), పాక్ ఫకర్ జమాన్ (13.01), ఇషాన్ కిషన్ (13) వరల్డ్‌కప్ 2023లో మొదటి మూడు మ్యాచ్‌ల తర్వాత అత్యుత్తమ ఫీల్డర్ అవార్డు కోసం పోటీపడ్డారు.ప్రతి జట్టు మరో మూడు, మూడు మ్యాచ్‌లు ఆడిన తర్వాత ఐసీసీ ఈ అవార్డును మరోసారి ప్రకటించే అవకాశం ఉంది.
(The above story first appeared on LatestLY on Oct 19, 2023 11:56 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

